Health & Lifestyle

కోడి గుడ్డు తినడం వలన లభించే ప్రయోజనాలు

KJ Staff
KJ Staff

ఇది వరకు టీవీ చూసే సమయంలో "గుడ్డును తినండి శక్తిని పెంచండి" అనే స్లోగన్ తో ఒక యాడ్ వచ్చేది. అధిక శక్తీ మరియు శరీరానికి అవసరమైన ప్రొటెయిన్ లు గుడ్డు ద్వారా లభిస్తాయని చెప్పడం ఈ యాడ్ సారాంశం. శరీర నిర్మాణానికి ప్రోటీన్లు చాల కీలకం, ఇటువంటి ప్రోటీన్లు అందించడంలో కోడి గుడ్లు మేలైనవి. కోడి గుడ్డు రోజు తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెల్సుకుందాం.

శరీర నిర్మాణంలో, కండరాల పనితీరులో ప్రోటీన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ ప్రోటీన్ ల నిర్మాణానికి అమైనో ఆమ్లాలు అవసరం, అమైనో ఆమ్లాలు గొలుసుల్లాగా ఏర్పడి ప్రోటీన్ నిర్మాణానికి కారణమవుతాయి. సాధారణంగా మనిషి శరీరం కొన్ని రకాల అమైనో ఆమ్లాలను తయారు చేసుకునే సామర్ధ్యం కలిగి ఉంటుంది, కాకపోతే కొన్ని రకాల అమైనో ఆమ్లాలను మాత్రం ఆహారం ద్వారా తీసుకోవాలి వీటినే ఎస్సెంటియాల్ ఎమినో ఆసిడ్స్ అంటారు. ఇటువంటి అమైనో ఆమ్లాలు పప్పుదినుసుల నుండి, మాంసాహారం నుండి మనకి లభిస్తాయి. అయితే అందరికి రోజు మాంసాహారం, పప్పుదినుసులు కొనుక్కుని తినే ఆర్ధిక స్థోమత ఉండకపోవచ్చు. అటువంటి వారిలో ప్రోటీన్ల లోపాలు ఎక్కువుగా ఉంటాయి. మన భారత దేశంలో ఎంతో మంది పిల్లలు, ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు, వారి ఆర్ధిక పరిస్థితే దీనికి ప్రధాన కారణం.

కోడి గుడ్డులో శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, మరియు ఇతర ఖనిజాలు పుషకాలంగా లభిస్తాయి. పైగా దీని ధర కూడా మాంశం తో పిలిస్తే చాల తక్కువ. గుడ్డును రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఊడబెట్టిన గుడ్డును తినడం ద్వారా 72 కిలో క్యాలోరీలు, 4.8 గ్రాముల ప్రోటీన్, 1.4 గ్రాముల సంతృప్త కొవ్వులు, వీటితో పాటు విటమిన్- ఏ, డి, ఈ లతో పాటు ఒమేగా-3 ఫ్యాట్య్ ఆసిడ్స్ ఉంటాయి. గుడ్డులోని పచ్చ సోనాకంటే, తెల్ల సొనలోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. భారత దేశంలోని పౌష్టికాహార లోపాన్ని నియంత్రించడంలో కోడి గుడ్డు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పిల్లల్లో ప్రోటీన్లు లోపించకూడదనే ఉదేశ్యంతోనే, చిన్న పిల్లకు అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, సరఫరా చేస్తారు.

కోడి గుడ్లలో లభించే ప్రోటీన్ 'పూర్తి ప్రోటీన్' కింద పరిగణిస్తారు, శరీరానికి అవసరమైన 9 రకాల అమైనో ఆసిడ్స్ ఒక్క గుడ్డు తినడం వల్ల లభిస్తాయి. తృణ ధాన్యాలు మరియు కాయగూరల ద్వారా కూడా ప్రోటీన్ లభిస్తుంది కానీ ఇవి అసంపూర్తి ప్రోటీన్లు ఎందుకంటే వీటిలో మనకు కావాల్సిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అమైనో ఆసిడ్స్ ఉండవు, అందుకోసమే ప్రతిరోజు గుడ్డును తినడం మంచిదని ఆహార నిపుణులు సూచిస్తారు. మాంసాహారంలో ప్రోటీన్ తేలికగా జీర్ణం కాదు, కానీ గుడ్డులోని ప్రోటీన్ తొందరగా జీర్ణం అవుతుంది. పాలఉత్పత్తుల్లో లభించే నాణ్యమైన ప్రోటీన్ గుడ్డులో కూడా లభిస్తుంది.

చిన్న పిల్లతో పాటు అన్ని వయసుల వారు ప్రతి రోజు కోడి గుడ్డు తినడం ఎంతో అవసరం. ఉడకబెట్టిన గుడ్డు తినలేని వారు, దీనితో ఎన్నో రకాల వంటలకు చేసుకోవచ్చు. వయసులో పెద్ద వారు గుడ్డు తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. వయసు పైబడే కొద్దీ కంటిచూపు మందగిస్తుంది. గుడ్డులోని పచ్చ సొనలో కెరోటిన్లు అధికంగా ఉంటాయి, ఇవి కంటి చూపు మెరుగుపరచడంలో మరియు శుక్లాలు రాకుండా కాపాడతాయి. ఈ విధంగా గుడ్డును తినడం ద్వారా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine