News

భారతదేశ ఆహార భద్రతకు వ్యవసాయ యాంత్రీకరణ కిలకపాత్ర పోషిస్తుంది: అశోక్ అనంతరామన్, సిఓఓ, ACE

KJ Staff
KJ Staff

నిత్యం పరిణామం చెందే రంగాల్లో వ్యవసాయం ఒకటి. దేశ జనాభా రేటుంపు వేగంతో పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తేర్చేందుకీ వ్యవసాయంలో కొత్త మార్పులు తీసుకురావడం ఎంతో కీలకం. వ్యవసాయ యాంత్రీకరణ ఈ మార్పుకు కారణం కాగలదు. వ్యవసాయం ద్వారా మంచి దిగుబడులు పొంది, అధిక లాభాలు ఆర్జించేందుకు, రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గుచూపడం అత్యంత కీలకం.

వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచి, కొత్త విప్లవం సృష్టించాలని కృషి జాగరణ్ భావిస్తుంది. దీనికి సంబంధించి మే 14, 2024 న కృషి జాగరణ్ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటుచెయ్యడం జరిగింది. ఈ సమావేశానికి భారత దేశంలో క్రేన్ల ఉత్పత్తిలో పేరొందిన ACE సంస్థ, సిఓఓ అశోక్ అనంతరామన్, మరియు ఆ కంపెనీ సీనియర్ మేనేజర్ రాజీవ్ రాజన్ పాల్గొన్నారు. కృషి జాగరణ్ వ్యవస్థాపకులు మరియు ముఖ్యసంపాదకులు ఎంసి. డొమినిక్, మరియు ఆయన సతీమణి షైనీ డొమినిక్(మేనేజింగ్ డైరెక్టర్, కృషి జాగరణ్), విచ్చేసిన అతిధులకు చిరు సత్కారం అందించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది.

మొదటగా కృషి జాగరణ్ వ్యవస్థాపకులు ఎం.సి. డొమినిక్ విచ్చేసిన అతిధులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు, అనంతరం ACE కంపెనీ సిఓఓ అశోక్ అనంతరామన్, తమ సంస్థ వ్యవసాయంలో యంత్రాల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి, వ్యవసాయంలో యంత్రాలు ఉపయోగానికి ఉన్న ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. ACE కంపెనీ గత 29 సంవత్సరాల నుండి క్రేన్ల తయారీలో మరియు విక్రయాల్లో అగ్రస్థానంలో ఉంది. దీనితో పాటు, భారత దేశంలో బుల్లెట్ ట్రైన్ మరియు మెట్రో ప్రాజెక్ట్లలోను ACE తనదైన గుర్తింపు ముద్ర వేసింది. మన దేశ రక్షణ విభాగాలైన ఆర్మీ మరియు నేవీ అవసరాలకు తగ్గట్టు యంత్రాలను అందిస్తూ, దేశ రక్షణలో భాగంగా నిలిచింది.

భారత దేశం, అధిక వ్యవసాయ ఉత్పాదకత ద్వారా దేశ ప్రజల ఆహార అవసరాలన్నీ పూర్తి కావడంతో పాటు, ఇతర దేశాలకు కూడా ఆహార ఎగుమతులు చేస్తున్నాం. అయితే రేటింపు వేగంతో పెరుతున్న జనాభాతో పాటు వ్యవసాయ విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది. దీని వలన భవిష్యత్తులో ఆహార లభ్యతలో కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే మనకు అందుబాటులో ఉన్న భూమిలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఒకటే మార్గం. వ్యవసాయ ఉత్పాదకత పెంచడంలో యంత్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

కృషి జాగరణ్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ACE సిఓఓ అశోక్ అనంతరామన్,వ్యవసాయ యాంత్రికరణలో భారత దేశం వెనుకబడి ఉందని అయితే ఈ మధ్యకాలంలో, పలు అవగాహనా కార్యక్రమాల ద్వారా రైతులు వ్యవసాయ యంత్రాలు వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు అయన తెలిపారు. ఆధునిక వ్యవసాయం మరియు ఖచ్చితత్వం తో కూడిన ఆధునిక వ్యవసాయానికి వ్యవసాయ యాంత్రీకరణ మెరుగైన బాటలు వేస్తుందని ఆయన తెలిపారు. వ్యవసాయాన్ని యాంత్రీకరించి, ఆధునీకరించడంలో కృషి జాగరణ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అయన ప్రస్తావించారు. చదుకున్న యువత, వ్యవసాయాన్ని చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలవాలని, మరియు వ్యవసాయనికి నూతన సాంకేతికతను జోడించాలని తెలిపి అయన ప్రసంగాని ముగించారు.

Share your comments

Subscribe Magazine