News

కోవిడ్ వాక్సినేషన్ తో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్: అస్ట్రాజెనికా

KJ Staff
KJ Staff

ప్రపంచం మొత్తాన్ని గడగడాలాడించిన కరోనా వ్యాధిని కట్టడి చెయ్యడంలో వాక్సిన్ ఎంతో ప్రభావంతంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. అయితే సమయం తక్కువుగా ఉంటడం మరియు ఇతర పరిస్థితుల మూలంగా వాక్సిన్ పరీక్షలు పెద్ద ఎత్తున జరపకుండానే విడుదల చెయ్యడం జరిగింది. దీని ప్రభావం ఇపుడిపుడే బయట పడుతుంది. తాజాగా కోవిడ్ వాక్సిన్ అందించిన సంస్థ ఆస్ట్రాజెనికా తమ వాక్సిన్ తో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

ఫార్మాసిటీకల్ కంపెనీలలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆస్ట్రాజెనికే చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ఈ కంపెనీ తయారుచేసిన కోవిడ్ 19 వాక్సిన్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. త్రంబోసైటోపినియ సిండ్రోమ్ అనే దుష్ప్రభావానికి కారణమవుతుందని తెలిపింది. ఈ వ్యాధి వచ్చిన వారిలో రక్తం గడ్డకట్టడం, రక్తంలోని ప్లేటిలెట్స్ కౌంట్ తగ్గడం గమనించవచ్చు.

ఆస్ట్రాజెనికే వాక్సిన్ ద్వారా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అనేక కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. దినికి స్పందించిన ఆస్ట్రాజెనికే తమ కోవిద్ 19 వాక్సిన్ అరుదైన దుష్ప్రభావాలకు దారితీస్తుందని కోర్టులో అంగీకరించింది. యూకే హైకోర్టు కు సమర్పించిన సైడ్ ఎఫెక్ట్స్ పత్రాల్లో, ఆస్ట్రాజెనికే కోవిడ్ వాక్సిన్ చాల అరుదైన సందర్భాల్లో టీటీఎస్ కి కారణంకావచ్చని తెలిపింది. ప్రజలు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇక నుండి బ్రిటన్లో ఈ వాక్సిన్ ని నిషేధించారు.

Share your comments

Subscribe Magazine