News

ఇండియన్ మసాలాలపై నిషేధం విధించిన మరోదేశం....

KJ Staff
KJ Staff

భారత దేశం మసాలా వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉత్పత్తయ్యే మసాలాలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయులతో పాటు, వేరే దేశ ప్రజలు కూడా మన వంటకాలు మీద మక్కువ పెంచుకొని ఈ మసాలాలను వినియోగిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో భారతీయ మసాలాలకు విదేశీ మార్కెట్లలో చేదు అనుభవం ఎదురవుతుంది. చాల దేశాలు మన దేశంలోని ప్రముఖ మసాలా బ్రాండ్ల మీద నిషేధం విధిస్తున్నాయి.

ఇండియాలోని ఎండిహెచ్, ఎవరెస్ట్ ప్రముఖ మసాలా తయారీసంస్థలు. వీరు భారత్తో పాటు అనేక దేశాలకు మసాలాలు ఎగుమతి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అనేక దేశాలు ఈ బ్రాండ్ మసాలా విక్రయాలకు నిషేధం విధిస్తున్నాయి. భారత దేశం తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ మసాలాలు అధిక ప్రజాధారణ ఉంది. కాకపోతే ఈ మాసాలలో క్యాన్సర్ కారకాలున్నాయని హాంగ్కాంగ్, సింగపూర్, బ్రిటన్ దేశాలు నిషేధం విధించాయి. ఈ జాబితాలోకి మరో దేశం చేరింది.

తాజాగా ఈ రెండు బ్రాండ్ మసాలాలను బ్యాన్ చేసిన దేశాల్లో నేపాల్ కూడా చేరింది. ఇప్పటివరకు నేపాల్ లో ఈ మసాలాలు విక్రయాలు జోరుగా సాగాయి. కానీ ఈ మసాలాల్లో ఇథలిన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించిన నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్, వీటిపై బ్యాన్ విధించాలని ప్రభుత్వానికి సూచించింది. దీనికి అనుగుణంగా ఈ మసాలా బ్రాండ్లు దిగుమతితో పాటు విక్రయాలు కూడా నింపివేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మసాలాలపై తుది నివేదిక వచ్చేంత వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది.

మరోవైపు పోయిన నెల సింగపూర్ ప్రభుత్వం కూడా ఈ రెండు మసాలా బ్రాండ్ల మీద బ్యాన్ విధించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. బ్రిటన్ లో కూడా ఈ నిషేధం కొనసాగుతుంది. ప్రజారోగ్యానికి హాని కలిగించే క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఈ బ్రాండ్లు ఆరోపణలు ఎదురుకుంటున్నాయి. వీటిలో వాడే దినుసులపై పూర్తి నివేదిక కోసం దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ మసాలా బ్రాండ్ల పై నిషేధం కొనసాగనుంది. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈ దేశాలు చెబుతున్నాయి.

Share your comments

Subscribe Magazine