News

జమ్మూలో అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

KJ Staff
KJ Staff

వేసవి కాలం వచ్చిందంటే, ఎండవేడి నుండి తప్పించుకోవడానికి చలి ప్రదేశాలకు వెళ్ళాలి అన్న ఆలోచన రావడవం సహజం. జమ్మూ కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్, షిమ్లా వంటి ప్రాంతాల్లో మండు వేసవిలోనూ, సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, అందుకే చాలా మంది వేసవిలో ఈ ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం ఈ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. శీతోష్ణ ప్రాంతమైన జమ్మూలో కూడా, మిగతా ప్రాంతాలలాగానే, ఉష్ణోగ్రత మార్క్ 40℃ దాటడం కలవరపెడుతుంది.

వేసవి కాలం మొదలైనప్పటినుండి జమ్మూలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మే 16, 2024, గురువారం, 40.2℃ ఉష్ణోగ్రతతో సీజన్ లోనే హాటెస్ట్ డే గా నిలిచింది. గరిష్టంగా 40.2 ℃ ఉష్ణోగ్రత నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రత 24.5 ℃ నమోదయ్యింది, ఇది సాధారణం కంటే 0.5 ℃ ఎక్కువ. నిత్యం భక్తులతో కిటకిటలాడే వైష్ణో దేవి కాట్రా లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాట్రా కొండ, దిగువున గరిష్ఠా ఉష్ణోగ్రత 36 డిగ్రీలు నమోదుకాగా, కనిష్టంగా 22.5 ℃ నమోదయ్యింది.

మరోపక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, వేసవి రాజధాని శ్రీనగర్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది, కాకపోతే ఈ ప్రాంతంలో, మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఈ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత 28.9℃ ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 13.6 డిగ్రీలు నమోదయ్యింది. ఈ ఏడాది దేశంలోని అన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎండలకు వేడి గాలులు కూడా తోడై ఉష్ణోగ్రతలను తార స్థాయికి చేరుస్తున్నాయి.

కానీ మండుటెండలు సతమతమవుతున్న జనం, ఇదే సమయంలో కురుస్తున్న వర్షలతో కాస్త ఉపశమనం లభిస్తుంది. జమ్మూ కాశ్మీర్ లో కూడా మే 18-19 మధ్య కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.

Share your comments

Subscribe Magazine