News

పెరగనున్న బియ్యం ధర ... దిగుబడిలో తగ్గుదలే కారణం

KJ Staff
KJ Staff

దేశవ్యాప్తంగా బియ్యం ధర పెరుగబోతున్నట్లు, వార్తలు వినిపిస్తున్నాయి, వరి సాగులో తగ్గుదలే దీనికి ప్రధాన కారణం. ఆసించినంత దిగుబడి లేకపోవడం, బియ్యం జాతీయ బియ్యం నిల్వలపై అధిక ప్రభావం చూపుతుంది. మరోవైపు బియ్యం ఎక్కువగా సాగుచేసే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, తమిళ్ నాడు రాష్ట్రాల్లో, వరి సాగు విస్తీర్ణం ఘననీయంగా తగ్గిపోయింది. బియ్యం నిల్వలు తగ్గిపోవడంతో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) భారీగా కొనుగోళ్ళకు సిద్ధం అయ్యింది. జాతీయ ధాన్యం అవసరాలను దృష్టిలో పెట్టుకొని సేకరించిన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరిలిస్తుంది.

బియ్యం నిల్వలలో తగ్గుదల ఉండటం కారణంగా, యాసంగి సాగు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది, సుమారు 75 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసందుకు సన్నాహాలు చేస్తుంది మరింత ఎక్కువ ధాన్యం వచ్చిన సరే సంసిద్ధంగా ఉండాలని ఎఫ్ సిఐ కి సూచించింది. సాధారణంగా యాసంగి వరి సాగు దేశవ్యాప్తంగా 1,31,25,000 ఎకరాలు కాగా ఈ సంవత్సరం తగ్గిపోయింది. ఈసారి అన్ని రాష్ట్రాలు కలిపి కేవలం, 98,22,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు నమోదయ్యింది. తద్వారా కేంద్రం టార్గెట్ లో 65% శాతం మాత్రమే వరి సాగు జరిగింది, 35% సాగులో తగ్గుదల కనిపిస్తోంది, దీనితో పాటు వాతావరణ మార్పు తోడై, బియ్యం లభ్యతలో మరింత సంక్షోభం ఏర్పడింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వరి సాగు విస్తీర్ణం చాల మేరకు తగ్గిపోయింది. క్రిందటి సంవత్సరం తెలంగాణలో 66 లక్షల ఎకరాల్లో వారి సాగు కాగా ఈ ఏడాది 50.84 లక్షల ఎకరాలకు తగ్గింది. సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దేశ ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించనుంది, భాస్మతేతర బియ్యం పై 20% పన్ను పన్నును విధించింది.

Read More:

క్రెడిట్ కార్డు వాడకంలో కీలక మార్పు.... ఏప్రిల్ 1నుండి అమలు.....

 

తెలంగాణ: 200 యూనిట్లు దాటితే బిల్లు మొత్తం చెల్లించాలా?

ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఎగుమతుల్లో భారత దేశం 40% వాటాను వహిస్తుంది. మన దగ్గరనుండి మొత్తం 140 దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుంది. కేంద్రం బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని విధించిన తర్వాత అంతర్జాతీయ ఎగుమతుల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటె జాతీయంగా మరియు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న బియ్యానికి కొందరు రైస్ మిల్ వర్తకులు మాత్రం తక్కువ ధర ఇస్తున్నారు. మొన్నటివరకు క్వింటాకు రూ. 2700 వరకు పెట్టి కొన్న మిల్లర్లు, పంట మార్కెట్లోకి వస్తున్న ఈ సమయంలో బియ్యం ధర తగ్గిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine