News

క్రెడిట్ కార్డు వాడకంలో కీలక మార్పు.... ఏప్రిల్ 1నుండి అమలు.....

KJ Staff
KJ Staff

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఐతే ఇకనుండి క్రెడిట్ కార్డు వాడకాల్లో కీలక మార్పులు రానున్నాయి. కొత్త మార్పులు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి.

మారుతున్న జీవనప్రమాణాల కారణంగా ఈ రోజుల్లో చాల మంది క్రెడిట్ కార్డు వాడుతున్నారు. దాదాపు అన్ని అవసరాలకు క్రెడిట్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. జనం ఎక్కువుగా ఆన్లైన్ షాపింగ్కి, ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోవడానికి, కరెంటు బిల్ మరియు పెట్రోల్ బంకులలో నగదు చెల్లించడానికి ఇలా చాల విధాలుగా క్రెడిట్ కార్డ్స్ వాడుతారు. బ్యాంకులు కూడా, వివిధ అవసరాలకోసం క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సక్షన్ చెయ్యడం ద్వారా క్రెడిట్ పాయింట్స్ ఇస్తాయి. ఈ క్రెడిట్ పాయింట్స్ ఉపయోగించి, చాల ఆన్లైన్ ప్లాటుఫార్మ్స్లో డిస్కౌంట్స్ పొందవచ్చు. అయితే రానున్న ఏప్రిల్ 1 వ తారీఖు నుండి క్రెడిట్ కార్డు పాయింట్స్ అలాగే ఫ్రీ లౌంజ్ అక్సిస్ లో కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు బ్యాంకులు స్పష్టం చేసాయి.

ఐసీఐసీఐ బ్యాంకు:

ఐసీఐసీఐ బ్యాంకు ఇప్పటివరకు ఇస్తున్న ఫ్రీ ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సిస్ పై కొన్ని సవరణలు చేసింది. వచ్చే త్రైమాసికానికి ఎయిర్పోర్ట్ లో ఈ సదుపాయం పొందాలంటే, దానికి ముందు త్రైమాసికంలో కనీసం 35,000రూ కన్నా ఖర్చు చేసి ఉండాలి. కోరల్ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంకు ప్లాటినం క్రెడిట్ కార్డు ఇంకా వివిధ క్రెడిట్ కార్డులకి ఈ షరతులు వర్తిస్తాయి.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రముఖమైన ఎస్బిఐ ఇప్పటివరకు తమ క్రెడిట్ కార్డు యూజర్లకు, ఇంటి అద్దె చెల్లింపుల్లో,రివార్డ్ పాయింట్స్ అందించేది, ఇకనుండి ఈ రివార్డ్ పాయింట్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్బిఐ అందిస్తున్న కార్డు ఎలైట్, సింప్లి క్లిక్ మొదలైన కార్డులకు మార్పులు ఏప్రిల్ ఒకటి నుండి రానున్నాయి.

యస్ బ్యాంక్:

ఇప్పటివరకు తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఫ్రీ లాంజ్ యాక్సిస్ ఇస్తున్న యస్ బ్యాంక్ ఇక నుండి కొన్ని సవరణలు చెయ్యనుంది. ఒక త్రైమాసికంలో లాంజ్ యాక్సిస్ పొందాలనుకుంటే, దానికి ముందు మూడు నెలల్లో కనీసం 10,000రూ కార్డు ద్వారా

యాక్సిస్ బ్యాంక్:

ఇక మిగతా బ్యాంకుల మాదిరిగానే యాక్సిస్ బ్యాంకు కూడా రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సిస్, వార్షిక రుసుముల్లో కొన్ని కీలక మార్పులు తీసుకువచ్చింది. టర్మ్ ఇన్సూరెన్సు చెల్లింపులు, బంగారు ఆభరణాలు కొనుగోలుకు ఇప్పటివరకు ఇస్తున్న రివార్డ్ పాయింట్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సిస్ పొందడానికి మూడు నెలల్లో కనీసం 50,000. రూ ఖర్చు చెయ్యవలసి ఉంటుందని స్పష్టం చేసింది.

నేడు ప్రపంచ జల దినోత్సవం: సుజలాం.... సుఫలామ్......

కృషి విజ్ఞాన్ కేంద్ర స్థాపక దినోత్సవం:

Share your comments

Subscribe Magazine