Agripedia

వరి పంటలో ''సల్ఫైడ్‌'' దుష్ప్రభావ లక్షణాలు మరియు నివారణ

Gokavarapu siva
Gokavarapu siva

పంట మార్పిడి లేకుండా ఏడాది పొడవునా ఈ వరి వంటను పండించడం వలన వరిలో ''సల్ఫైడ్‌'' దుష్ప్రభావాన్ని చూడవచ్చు. కనుక ఒక స్థలంలో వానాకాలం మరియు వేసవికాలంలో వరి పంట పండించకుండా వేరే పంటలను పండించడం ద్వారా ఈ ''సల్ఫైడ్‌'' దుష్ప్రభావాన్ని తగ్గించవచ్చు. వరి పంటలలో ఈ ''సల్ఫైడ్‌'' దుష్ప్రభావం వలన కలిగే లక్షణాలు మరియు వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం.

వరి వంటలో ఈ ''సల్ఫైడ్‌'' దుష్ప్రభావం కలగడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే, పొలంలో అధికంగా నీరు ఉండటం, దానితో పాటు పంట యొక్క వేర్లకు సరిగ్గా గాలి అందకపోవడం మరియు పంట నెలలో జరిగే రసాయన చర్యలతో మార్పులు రావడం ఇవ్వన్నీ ''సల్ఫైడ్‌'' దుష్ప్రభావానికి గల కారణాలు.

వీటితోపాటు పంటలు బాగా పెరగడానికి మనం వాడే అమ్మేనియం సల్ఫైడ్‌, సింగిల్‌ సూపర్‌ ఫాస్పెట్‌ని అధిక మోతాదులో వాడితే వరి పంటలో మనం ఈ సల్ఫైడ్‌ దుష్ప్రభావాన్ని గమనించవచ్చు. దీనితోపాటు సల్పైడ్‌ ఉన్న కాంప్లెక్సు ఎరువులను ఐరన్ లోపం ఉన్న నేలల్లో అధికంగా వాడటం వలన కూడా దీనిని గమనించవచ్చు. వరి పంటలో ఈ సల్ఫైడ్‌ దుష్ప్రభావం దిగుబడి అనేది 30 నుండి 50 శాతం వరకు తగ్గిపోతుంది.

సాధారణంగా సల్ఫైడ్‌ దుష్ప్రభావం అనేది వర్షాకాలంలో కంటే వేసవికాలంలో ఎక్కువగా చూస్తాము. ఎందుకంటే వర్షాకాలంలో వర్షపు నీటివలన సల్ఫర్ కరిగిపోతుంది. ఈ సల్ఫైడ్‌ దుష్ప్రభావం వలన వరి పంటలో గుంపులు గుంపులుగా పంట అనేది పసుపు రంగులోకి మారుతుంది, దీనివల్ల పంట ఎదుగుదల దెబ్బతిని, దిగుబడి తగ్గుతుంది.

ఇది కూడా చదవండి..

షాకింగ్! శవాలు నిల్వచేసేందుకు వాడే రసాయనంతో పాల తయారీ..

సల్ఫైడ్‌ దుష్ప్రభావం వలన మట్టి నుండి కుళ్లిపోయిన వాసన వస్తుంది. మొక్కల యొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. పొలంలో మట్టి మెత్తగా మారిపోతుంది. వాటితోపాటు పొలంలో బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. పంట యొక్క వేర్లు నల్లగా మారిపోవడం అనేది దీని యొక్క లక్షణాలు.

పైన చెప్పిన ఈ లక్షణాలు పొలంలో గనుక సనిపించినట్లైతే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. దీని నివారణకు పంట వేయడానికి ముందు 1-2 బండ్ల ఎర్రమట్టిని వేసి కలియబెట్టి ఆరబెట్టడం, భూమిని ఎత్తు చేయటం చేయాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పొలంలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు మొక్క వేర్లకు తగిన గాలి వెళ్లే విధంగా చూసుకోవాలి. అధిక మోతాదులో సల్ఫైడ్‌ కలిగిన ఎరువులను వాడకూడదు. హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి ఒక ఎకరాకు మందు ద్రావణం పిచికారీ చేయడం వలన సల్ఫైడ్‌ దుష్ప్రభావాన్ని తగ్గించవచ్చు.

ఇది కూడా చదవండి..

షాకింగ్! శవాలు నిల్వచేసేందుకు వాడే రసాయనంతో పాల తయారీ..

Share your comments

Subscribe Magazine