ధరల నియంత్రణ విషయంలో మోదీ ప్రభుత్వ పనితీరు చాలా నిరాశాజనకంగా ఉంది. ఇటీవలి కాలంలో పెట్రోలు, వంటగ్యాస్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా వంటనూనెల ధర కూడా రికార్డు స్థాయికి చేరుకోవడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.
అయితే టమాటా, చింతపండు ధరలు కూడా ఇప్పుడు భారీగా పెరుగుతున్నాయి. ఇక తన వంతు అన్నట్టు అల్లం ధర కూడా అందనంత ఎత్తుకు చేరుతున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో అల్లం రూ.400లకు అమ్ముడు పోవడంతో సామాన్యుల ఆర్థిక ప్రణాళికలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పోటీతత్వంతో పెరుగుతున్నప్పటికీ, పెరుగుతున్న ఈ ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సమర్థవంతమైన చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం కర్ణాటక బహిరంగ మార్కెట్‌లో కిలో అల్లం ధర రూ. 300 నుంచి రూ. 400 ఉంది. 60 కిలోల అల్లం ఉన్న బ్యాగ్ ధర రూ. 11,000. వ్యాపారుల ప్రకారం, గత ఏడాది ఇదే కాలంలో, ఒక బ్యాగ్ ధర రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు ఉండేది. అల్లం ధరలు గత పదేళ్లలో ఇంత పెద్దఎత్తున పెరగకపోవడం గమనార్హం. గత రెండు పంటల సీజన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రత్యేకించి భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా అల్లం దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..
విద్యార్థులకు గమనిక.. ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం
అల్లం,వెల్లుల్లి విక్రయాలకు విజయవాడ పెట్టింది పేరు. ఇక్కడ నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సప్లై అవుతాయి. కానీ ధరలు చూస్తే భగ్గుమంటున్నాయి. అయితే, ఏప్రిల్ లో కిలో అల్లం 80 రూపాయలు ఉండగా.. వెల్లుల్లి 50 రూపాయలు పలికింది. జూలైలో అల్లం 200 ఉండగా.. ప్రస్తుతం 280 రూపాయలకు చేరుకుంది. అటు వెల్లుల్లి సైతం 200 రూపాయలకు వరకు పెరిగింది. కాగా దీనికి కొంత కారణం కృత్రిమ కొరత అని కొందరు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments