మిర్చి పంటను వేయాలంటేనే భయపడేవిదంగా తెగుళ్ళ సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి ఇదే క్రమంలో తెలంగాణ లో గత ఏడాది ఖమ్మంలో 35 వేలు పలికి రికార్డు సృష్టించగా ఈ ఏడాది ఏకంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్కు కేవలం నాలుగు క్వింటాళ్ల దేశీ రకం మిరపకాయలు(పొడి)-దేశి వరంగల్ రకం 4 క్వింటాలు రాగ క్వింటాల్ కు గరిష్టముగా 80,100 చొప్పున రికార్డు ధర పలికింద
శుక్రవారం వివిధ మార్కెట్లలో ఎండు మిర్చి ధరలు :
మిర్చి రకం |
జిల్లా మార్కెట్ |
గరిష్ఠ ధర క్వింటాలుకు |
మిరపకాయలు(పొడి)- |
వరంగల్ |
రూ.80,100 |
చిల్లీస్(పొడి)-నం.I రకం |
మహబూబ్‌మాన్షన్ |
రూ.23,000 |
చిల్లీస్(పొడి)-నం.II |
మహబూబ్‌మాన్షన్ |
రూ.12,000 |
|
|
|
మిరపకాయలు(పొడి)-తాళు |
ఖమ్మం |
రూ.9,300 |
మిరపకాయలు(పొడి)-తాళు |
వరంగల్ |
రూ.10,000 |
మిర్చి(పొడి)-తేజ |
ఖమ్మం |
రూ.21,000 |
మిరపకాయలు(పొడి)-తేజ |
వరంగల్ |
రూ.20,000 |
చిల్లీస్(డ్రై)-US-341 |
వరంగల్ |
రూ.26,000 |
మిరపకాయలు(పొడి)- వండర్‌హాట్ |
వరంగల్ |
రూ.37,000 |
ఈసారి మిర్చికి ఫుల్ డిమాండ్ ఉంది. సీజన్ ప్రారంభంలోనే రికార్డు ధర పలుకుతోంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లకు 6,677క్వింటాళ్ల మిర్చి రాగా భారీగా ధర వచ్చింది.
ఇదే మార్కెట్కు వండర్ హాట్ రకం 19 క్వింటాళ్లు రాగా గరిష్టంగా క్వింటాల్ రూ.37 వేలు, కనిష్టంగా రూ.31 వేలు పలికింది. హైదరాబాద్ లోని మలక్పేట్ మార్కెట్కు నంబర్ వన్ రకం 370 క్వింటాళ్లు రాగా క్వింటాల్ కు గరిష్టంగా రూ.23 వేలు దక్కింది. యూఎస్ 341 రకం క్వింటాల్ రూ.26 వేలు పలికింది. క్వింటాల్ తేజ రకం మిర్చికి ఖమ్మంలో రూ.21 వేలు, వరంగల్ లో రూ.20 వేలు దక్కింది. కాగా, సాధారణంగా పాత మిర్చి ఎక్కువ ధర పలుకుతుంది.
యాసంగి ప్రారంభం లోనే రికార్డు స్థాయిలో 10 లక్షల ఎకరాలో వరి సాగు ...
ఈసారి వర్షాలకు తోడు నల్లనల్లి, తామరపురుగు ఎఫె క్ట్తో మిర్చి పంట దెబ్బ తిని దిగుబడి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఖమ్మం, వరంగలు తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు మార్కెట్ నుంచి విదేశాలకు మిర్చి ఎగుమతి అవు తోంది. వారం పది రోజుల నుంచి మార్కెట్లకు మిర్చి రాక మొదలైంది. ఖమ్మం మార్కెట్ కు తేజ రకం మిర్చి రోజూ 4 వేల నుంచి 6 వేల క్వింటాళ్ల వరకు వస్తోంది. శుక్రవారం 4,804క్వింటాళ్లు, గురువారం 5,898 క్వింటాళ్లు, బుధవారం 4,748 క్వింటాళ్లు వచ్చింది.
Share your comments