Agripedia

ప్రపంచంలోనే ఎంతో ఖరీదైన పండ్లు ఇవే..వీటి ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Srikanth B
Srikanth B

సాధారణంగా మనం పండ్ల మార్కెట్ కు వెళ్ళినప్పుడు పండ్ల ధర కిలో 200 లేదా 300 అంటేనే వామ్మో ఇంత ధర అని ఆశ్చర్యపోతాం. అదే పండ్లు కిలో లక్షలలో పలికితే మనకు నోట మాట రాదు. అసలు అంత ధర పలికేంత ప్రత్యేకత ఆ పండ్లలో ఏముంది? అంత ధర పలికే ఆ పండ్లు ఏవి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...

స్క్వేర్ పుచ్చకాయ: సాధారణంగా మనం పుచ్చకాయలు అంటే కేవలం గుండ్రని ఆకారంలో ఉన్నవి మాత్రమే చూసే ఉంటాం. అయితే కొన్ని దేశాలలో పుచ్చకాయలు చతురస్రాకారంలో పండిస్తున్నారు. ఇది చూడటానికి భిన్నంగా ఉండటమే కాకుండా ఎంతో రుచిని కలిగి ఉంటాయి. ఈ విభిన్నమైన పుచ్చకాయలు సుమారు 2,26,837 కు అమ్ముడవుతాయి. ఇవి ఐదు కిలోలు బరువు ఉంటాయి.

తైయో నో టామాగో: జపాన్‌లోని మియాజాకి ప్రావిన్స్‌లో పండించే ఈ మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు. ఈ మామిడి పండ్లు కిలో మూడు లక్షల కన్నా ఎక్కువే.

యుబారి పుచ్చకాయ: జపాన్ కి చెందిన ఈ పుచ్చకాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయలు.వీటిని జపాన్‌లోని యుబారి ప్రాంతంలో పండిస్తారు. ఈ పుచ్చకాయల సరుకును 2019లో ఏకంగా 33 లక్షలకు వేలం వేశారు.

రూబీ రోమన్ ద్రాక్ష: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షలో రూబీ రోమన్ ద్రాక్ష ఒకటి. దీనిని జపాన్ లో పండిస్తారు.ఈ ద్రాక్షలో ఒక బంచ్ మాత్రమే రూ.7.50 లక్షలకు అమ్ముడైంది. ఈ ద్రాక్ష పండ్లు ఎంతో ఎక్కువ ఖరీదు కావడంతో దీనిని ధనికుల ఫలం అని కూడా పిలుస్తారు.

వర్షాకాల పంటలకు (ఖరీఫ్) కనీస మద్దతు ధరను పెంచిన కేంద్ర ప్రభుత్వం!

హెలిగాన్ పైనాపిల్: పసుపురంగులో కలిగి ఉండే ఈ పైనాపిల్ ప్రపంచంలోనే అత్యంత ధరలలో ఒకటిగా విరాజిల్లుతోంది.బ్రిటన్‌లోని లాస్ట్ గార్డెన్స్ ఆఫ్ హెలిగాన్‌లో మాత్రమే పెరుగుతాయి. కేవలం ఒక్క పైనాపిల్ మాత్రమే లక్ష రూపాయల ధర పలుకుతుంది.

 

Share your comments

Subscribe Magazine