ముఖ్య ఆహార పంట అయిన వరి సాగును మన రాష్ట్రంలో ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వరి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే మన ప్రాంత వాతావరణానికి, నేలకు అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. బాగా ప్రాచుర్యం పొందినవ వరి విత్తన రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విత్తన రకాలు:
బిపిటి 5204 (సాంబ మషూరి ): బియ్యం సన్నగా,నాణ్యంగా ఉంటుంది. అత్యంత ప్రాచుర్యం పొంది అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న రకం. ఖరీఫ్ సీజన్ కు అనుకూలమైన రకం.పపంటకాలం 145-150 రోజులు, దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. అగ్గితెగులు,ఎండాకు తెగులును తట్టుకుంటుంది.
యంటియు-1001 (విజేత): సన్నబియ్యం రకానికి చెందినది.ఖరీఫ్, రబీ సీజన్లో సాగు చేయవచ్చు. పంటకాలం 140 రోజులు ఉండిఎకరాకు 2.5 టన్నులు దిగుబడినిస్తుంది.
వరిలో ఎక్కువగా నష్టపరిచే సుడిదోమ, అగ్గి తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది.
బిపిటి-3291(సోనా మషూరి): ఖరీఫ్ సీజన్ కు అనుకూలమైన రకం.గింజ చాలా చిన్నగా ఉండి నాణ్యమైన బియ్యం ఇస్తుంది. పంటకాలం 145 రోజులు ఉండి,ఎకరాకు 2.5 టన్నులు దిగుబడినిస్తుంది. అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది.
యంటియు-1010 (కాటస్ దొర సన్నాలు):
సన్న రకం, రభి కాలానికి అనుకూలమైనది.పంటకాలం 120 రోజుల ఉండి,ఎకరాకు 3.2 టన్నులు దిగుబడినిస్తుంది.సుడిదోమ, అగ్గి తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది.
Zinc Deficiency :వరి పంట లో జింక్ లోపము-సమగ్ర నివారణ మార్గాలు!
యస్ యల్ ఆర్-145 (స్వర్ణముఖి):అతి సన్న బియ్యం రకం. రబి కాలానికి అనుకూలమైనది.పంటకాలం 135 రోజుల ఉండి,కాండం తొలుచు పురుగు ,ఉల్లికోడు, అగ్గితెగులును తట్టుకుంటుంది .
జ్జయల్ -1798 (జగిత్యల సన్నాలు):ఖరీఫ్ సీజన్ కు అనుకూలమైన రకం. పంటకాలం 120- 125 రోజులు ఉండి,ఎకరాకు 2.5 టన్నులు దిగుబడి వస్తుంది. గింజ సన్నగా సాంబా మషూరి రకాన్ని పోలి యుంటుంది.
యంటియు-7029 ( స్వర్ణ ) : ఖరీఫ్ సీజన్ కు అనుకూలమైన రకం.గింజ చాలా చిన్నగా ఉండి నాణ్యమైన బియ్యం ఇస్తుంది. పంటకాలం 150 రోజులు ఉండి,ఎకరాకు 3 టన్నులు దిగుబడినిస్తుంది. చేను మీద గింజు మొలకెత్తదు.చౌడు భూమిలో పండించడానికి అనుకూలంగా ఉంటుంది.
డబ్ల్యుజియల్-20471 (ఎర్రమల్లెలు):గింజ పొడవుగాసన్నగా పుంటుంది. ఖరీఫ్ ,రబి కాలాలకు అనుకూలం,పంటకాలం 120-125 రోజులు,ఉల్లికోడు తెగులును తట్టుకుంటుంది.
తెల్లహంస:అన్నికాలాలకు అనుకూలంగా ఉండిగింజ పొదవుగా నాణ్యత కలిగి వుంటుంది.పంటకాలం 125 రోజులు ఉండి ఎకరాకు 2.5 టన్నులు దిగుబడి వస్తుంది. అగ్గితెగులు, ఎండాకు తెగులు ను తట్టుకుంటుంది.
Share your comments