Agripedia

పసుపుకు రికార్డు ధర .. ఆనందంలో పసుపు రైతులు!

Srikanth B
Srikanth B
పసుపుకు రికార్డు ధర .. ఆనందంలో పసుపు రైతులు
పసుపుకు రికార్డు ధర .. ఆనందంలో పసుపు రైతులు

గత సీజనులో ఆశించిన స్థాయిలో పసుపు ధర రాలేదు తెలంగాణలోని ప్రధాన మార్కెట్లలో 5 వేల నుంచి 6 వేలు పలికిన పసుపు ధర ఇప్పుడు 10 వేలు మార్కును దాటింది దీనితో పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత సీజనులో ఆశించిన స్థాయిలో ధర రాలేదు దీనితో కొందరు రైతులు పంటను కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరుచుకున్నారు . ఇప్పుడు ధర ఎక్కువగా రావడంతో రైతులు పంటను మార్కెట్టుకు తరలించి అమ్ముకుంటున్నారు . ఎట్టకేలకు గిట్టుబాటు ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు . నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు ధర రికార్డులు సృష్టిస్తోంది.

నిజామాబాద్‌ మార్కెట్‌లో క్వింటా పసుపు ధర 10 వేలు దాటింది. దీంతో కోల్డ్ స్టోరేజీలో నిల్వచేసుకున్న రైతుల పంట పడుతోంది. ముందే పంటను అమ్ముకున్న రైతులు నిరాశ చెందుతున్నారు. నిజిమాబాద్‌ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు పంటకు ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయి ధర లభించింది.దీనితో రైతులకు గిట్టు బాటు ధర లభించి పెట్టిన పెట్టుబడి పొందుతున్నట్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తక్కువ ధరకు నిత్యావసరల పంపిణీకి కసరత్తు ...

గత ఈ సీజన్‌లో కొమ్ము గరిష్ట ధర రూ. 7,800లోపు పలికి ధర గురువారం నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామానికి చెందిన రైతు మార్కెట్‌కు 38 క్వింటాళల్ పసుపు పంటను తరలించాడు.ఇదే రైతు తీసుకొచ్చిన పసుపు మండ రకానికి క్వింటాకు రూ.9,211లుగా ధర పలికింది.గతంలో 50 వేల ఎకరాలలో సాగు జరుగగా ఈ సంవత్సరం 32 వేల ఎకరాలలో మాత్రం పసుపు సాగుజరిగింది దీనితో ధరలు మరింత పెరగనున్నాయి.

తక్కువ ధరకు నిత్యావసరల పంపిణీకి కసరత్తు ...

Related Topics

Turmaric board

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More