Agripedia

సాగుకు అనుకూలమైన జొన్న రకాలు ...

Srikanth B
Srikanth B

 

అన్ని రకాల పంటలలలో చిరుధాన్యాలు తక్కువ పెట్టుబడి , తక్కువ నీటి తో సాగువవుతాయి అందులో ముఖ్యమైనవి జొన్నలు అయితే జొన్నల సాగులో విత్తనాల ఎంపిక కీలకం రెండు తెలుగు రాష్ట్రాలలో సాగుకు అనుకూలమైన రకాలను ఇక్కడ చుద్ద్దాం ! ఖరిఫ్ కుఅనువైనది.పంట కాలము 105-110 రోజులు.దిగుబడి 20-22క్వి/ఎ.ఎత్తుగా పెరుగుతుంది.గింజ,చొప్ప దిఫ్=దిగుబడిఎక్కువగా ఇస్తూ౦ది.

సి.ఎస్.హెచ్.-1
ఖరిఫ్ కు అనువైనది.పంట కాలము 112 రోజులు.దిగిబడి 16-17క్వి/ఎ.ఎత్తుగా పెరుగుతుంది(112-200 సెం.మి)గింజ చొప్ప దిగిబడిఎక్కువగా ఇస్తు౦ది.

సి.ఎస్.వి.-15:
ఖరిఫ్కు అనువైనది.పంటకాలము 110రోజులు.దిగుబడి 14-15క్వి/ఎ. ఎత్తుగా పెరుగుతుంది.మేలుజాతి.గింజ,చొప్ప దిగుబడి ఎక్కువగాఇస్తు౦ది. చొప్ప పశువులు ఇష్టంగా తింటాయి.

 

 

ఐ.సి.ఎస్.వి.-745:
ఖరిఫ్ కుఅనువైనిది .పంటకాలము 95-100 రోజులు.పంట త్వరగా కోతకు వస్తుంది.మిడ్ల్ నుతట్టుకుంటు౦ది.కంకి చొప్ప నిష్పత్తి బాగు౦టు౦ది.వర్షభావ పరిస్ధితిని టట్టుకుంటుంది.పోషక పధార్దాల వినియోగం బాగా వు౦టు౦ది.

ఎన్.టి.జె-2:
ఖరిఫ్,రబీ కు అనువైనది,నీటిఎద్దడిని తట్టుకుంటుంది.

పి.వి.కె.-801(పర్భని స్వెత):
ఖరీఫ్ కుఅనువైనది.పంట కాలము 100-110 రోజులు. దిగుబడి 12-16క్వి/ఎ.ఎత్తుగా పెరుగుతుంది.గింజ,చొప్ప దిగుబడి ఎక్కువ ఇస్తు౦ది.బూజు తెగులును తట్టుకుంటుంది. పోషక పధార్దాల వినియెగ సామర్ద్యం బాగా వుంటుంది.


సి.ఎస్.హెచ్.-5:
అన్ని కాలాలకు అనువైనది. పంట కాలము105-110 రోజులు. దిగిబడి14-16క్వి/ఎ.కంకి ,కండె ఆకారంలో ఉండి బూజు తెగులును తట్టుకో౦టు౦ది.

సజ్జ సాగు ప్రాముఖ్యత, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు ఎంపిక.....!


సి.ఎస్.హెచ్.-9:
ఖరీఫ్ ,రబీ లకు అనువైనది.పంటకాలము 105-110రోజులు. దిగుబడి16-18క్వి/ఎ.అన్నిలక్షణాలు సి.ఎన్.హెచ్.-1 మాదిరిగానే వుంటాయి.


సి.ఎస్.హెచ్.-13:
ఖరీఫ్ ,రబీ కు అనువైనది.పంట కాలము 110-115 రోజులు.దిగుబడి 12-`14క్వి/ఎ.ఎత్తుగా పెరుగుతుంది.గింజ,చొప్ప ఎక్కువగా ఇస్తు౦ది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
సి.ఎస్.హెచ్-16 :
ఖరీఫ్ కుఅనువైనిది.పంట కాలము 105-110రోజులు.దిగుబడి15-17క్వి/ఎ .బూజు మరియు ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది.

సజ్జ సాగు ప్రాముఖ్యత, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు ఎంపిక.....!

Share your comments

Subscribe Magazine