షిర్డీలో సాయిబాబా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే మహా పసుందన్ ఎక్స్‌పో ప్రదర్శనలో దేశం నలుమూల నుంచి రైతుల వద్ద ఉన్న ఉత్తమ రకాల పశువులు ప్రదర్శనలో పాల్గొన్నాయి , అయితే ఇందులో ఒక దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది హర్యానా గుర్తియార్ సింగ్ కు చెందిన ఈ దున్నపోతు ధర ఏకంగా 12 కోట్ల రూపాయలు భారీ కాయం తో ఉన్న ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచింది .
మహారాష్ట్రలో జరుగుతున్న ఈ పశువుల ప్రదర్శనలో దేశంలోని వివిధ జాతుల పశువులు పాల్గొన్నాయి. హర్యానా రాష్ట్రానికి చెందిన ముర్హా జాతికి చెందిన ఇందర్ అని పిలవబడే దున్న ఈ ఎక్స్‌పోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన ఈ దున్న నుండి పుట్టిన గేదె 25 లీటర్ల పాలు ఇస్తుంది. నల్లగా భారీకాయం తో , పొడుగ్గా, దృఢంగా ఉండే ఈ దున్నపోతును చూసేందుకు రైతులు ఎగబడుతున్నారు.
రూ.12 కోట్ల విలువైన దున్నపోతు రాకతో ఈ ప్రాంత రైతులు ప్రదర్శనలో ఈ భారీ దున్నపోతును చూసేందుకు ఎగబడ్డారు. ఈ ఇందర్ ధర వింటే చాలా మంది నమ్మలేరు. దీని గురించి ఇందర్ యజమాని గుర్తియార్ సింగ్‌ను అడిగితే, ఈదున్న పోతు యొక్క వీర్యం ద్వారా సంవత్సరానికి 75 నుండి 80 లక్షల రూపాయల ఆదాయం సమకూరుస్తుందని చెప్పారు.
షిర్డీలో జరుగుతున్న ఈ 'మహాపుషూధన్ ఎక్స్‌పో' లక్షలాది మంది రైతులు పాల్గొంటున్నారు , రైతుల సౌకర్యార్థం 46 ఎకరాల స్థలంలో ఈ మేళ నిర్వహించబడుతుంది .
తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్ రైలు.. ఇక 8 గంటల్లో తిరుపతి కి
అయితే ఈ దున్నపోతును మేపడానికి నిత్యం తిండికి దాదాపు రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుండగా పచ్చి మేత, పప్పులు ఇతని ఆహారం. దీని ద్వారా జన్మించిన ముర్రా జాతి గేదెలకు భారీ డిమాండ్ వుంది , దీని ద్వారా పుట్టే గేదెలు రోజుకు 30 లీటర్ల పాలు ఇస్తాయని రైతు ఈ దున్నపోతును తన సొంత కొడుకులా చూసుకుంటున్నారని ఇందర్ యజమాని గుర్తియార్ సింగ్ తెలిపారు.
షిర్డీ, సాయిలో జరుగుతున్న దేశంలోనే అతిపెద్ద పశువుల ప్రదర్శనకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పశుసంవర్థక శాఖ తరపున జరుగుతున్న ఈ ఎక్స్‌పోలో వివిధ జాతుల జంతువులు, పశువులు, పక్షులు ఇక్కడ చూడవచ్చు. కాబట్టి పశువుల పెంపకం లేదా పాడి పశువుల పోషణ నిర్వహించడంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి నిపుణులు మార్గదర్శకత్వం కూడా పొందుతున్నారు.
ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లకు రైతులు, పౌరులు భారీగా తరలివచ్చారు. ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుందని, జిల్లా నలుమూలల నుంచి రైతులను షిర్డీకి తీసుకురావడానికి జిల్లా పరిషత్, పశుసంవర్ధక శాఖతో పాటు విఖే పటాల్ దాదాపు 500 బస్సులను ఏర్పాటు చేశారు.
Share your comments