రైతులకు వ్యవసాయం ద్వారా కాకుండా దాని అనుబంధ రంగం పాడి పరిశ్రమ ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతుంటారు , పాడి పరిశ్రమలో లాభాలు ఊరికే రావు పాడి పశువులు సరిగా పాలు ఇస్తానే వస్తాయి అయితే రైతులు పాడి పరిశ్రమలో అధికంగా నష్టపోయేది గేదెలు ,ఆవులు సరిగా పాలు ఇవ్వకపోవడం సరైన సమయంలో ఎదకు రాకపోవడం అయితే ఎక్కడ ఒక గెద్దె ఒక్క రోజుకు 26.59 లీటర్లు పాలు ఇస్తూ రికార్డు సృష్టించింది .
ఏపీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వ్యక్తి సైతం పాలవ్యాపారం మొదలు పెట్టి రూ. వేలు సంపాదిస్తున్నాడు. మండపేట రైతుకు చెందిన ఓ గేదె రోజుకు 26.59 లీటర్ల పాలిస్తుంది. ఈ గేదెతో ఓ కుటుంబం పాల వ్యాపారంలో గణనీయమైన లాభాలను ఆర్జిస్తోంది.
పాల ఉత్పత్తి పరంగా భారతీయ గేదెల యొక్క 7 అత్యంత ముఖ్యమైన జాతులు!
ఆ గేదె వయసు నాలుగేళ్లు మాత్రమేనని.. పాలు దిగుబడిలో తల్లిని మించిపోయిందని తెలిపారు. రోజుకు 26.59 లీటర్ల పాలు ఇస్తూ రికార్డు సృష్టించిందని సంతోషం వ్యక్తంచేశారు. ఎనిమిదేళ్ల కిందట తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశానని రైతు వివరించారు.
పాల ఉత్పత్తిలో దేశము 254. 4 మిలియన్ ఉత్పత్తి తో ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో ఉంది .
. ముర్రా జాతి గేదె గురించి :
ఈ జాతి ముఖ్యం గ హర్యానాలోని రోహ్‌తక్, హిసార్ మరియు జింద్ మరియు పంజాబ్‌లోని నభా మరియు పాటియాలా జిల్లాలు ప్రాంతానికి చెందినది . ముర్రా రంగు సాధారణంగా జెట్ నలుపు రంగులో ఉంటుంది, తోక, ముఖం మరియు అంత్య భాగాలపై తెల్లటి గుర్తులు ఉంటాయి. సగటు పాల దిగుబడి సంవత్సరానికి 1,500-2,500 లీటర్ల వరకు ఇస్తుంది.
Share your comments