ఇండియాలో ఆవుల పెంపకం ఎక్కువ. దీనికి ఒక వృత్తిగా భావించి జీవించేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. హిందూవులైతే ఆవులను దేవుడితో పోలుస్తారు. పండుగల సమయంలో ఆవులను పూజిస్తారు. గృహప్రవేశం సమయంలో ఆవును తొలుత ఇంట్లోకి పంపి ఆ తర్వాత గృహప్రవేశం చేస్తారు. అంతగా హిందూ సాంప్రదాయంలో ఆవుకు ప్రాధాన్యత ఉంది. ఇక చాలా ఆయుర్వేద ఔషధాల్లో ఆవు పాలు, యూరిన్‌ను ఉపయోగిస్తారు. ఆవు యూరిన్‌ను ఒక మెడిసన్‌గా భావిస్తారు. అంతగా ఇండియాలో ఆవుకు ప్రధాన్యత ఉంది.
ఇక రైతులు ఆవు పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు. కొంతమంది ఆవుల పెంపకంతోనే లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఆవు పాలల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆవు పాలను తాగడం ద్వారా ఎన్నో విటమిన్లు శరీరానికి అందుతాయి. అందుకే ఆవు పాలను తాగేందుకు చాలామంది ఇష్టపడతారు. ఇంతకు సంకరజాతి ఆవుల పెంపకం ఎలా.. అధిక పాల దిగుబడి రావాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంకరజాతి ఆవుల వల్ల లాభాలేంటి?
సంకరజాతి ఆవు సంవత్సరం నుంచి సంవత్సరంన్నర మధ్యలో ఎదకు వస్తుంది. అదే దేశవాళీ ఆవు అయితే 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఎదకు వస్తుంది. ఇక సంకరజాతి ఆవులు 300 రోజులు పాలిస్తాయి. అదే దేశవాళీ ఆవులు అయితే ఒక ఈతలో 200 రోజులు మాత్రమే పాలిస్తాయి. ఇక సంకరజాతి ఆవులు ఈతకు, ఈతకు మధ్యకాలం 14 మాసాలు మాత్రమే ఉంటుంది. అదే దేశవాళీ ఆవులు అయితే 2 సంవత్సరాల మధ్య తేడా ఉంటుంది. ఇక సంకరజాతి ఆవులు 6-8 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. అది దేశవాళీ ఆవుల కన్నా సంకరజాతి ఆవులు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ పాలు ఇస్తాయి.
దేశవాళీ ఆవులు 1-2 లీటర్ల పాలు మాత్రమే ఇస్తాయి. ఇక సకరజాతి ఆవుల రుతుక్రమం సక్రమంగా ఉంటుంది. అదే దేశవాళీ ఆవుల రుతుక్రమం సరిగ్గా ఉండదు. ఇవన్నీ చూసుకుంటే దేశవాళీ ఆవుల కంటే సంకరజాతి ఆవుల వల్ల ఎక్కువ పాల దిగుబడి ఉంటుంది. అయితే సంకరజాతి ఆవులు అధిక వేడికి తట్టుకోలేవు. గాలికుంటు వ్యాధి, పిడుదులు, గోమారుల నుంచే వ్యాధులు సంకరజాతి ఆవులకు ఎక్కువ వస్తాయి. సంకరజాతి ఆవు ఖరీదు రూ.15 వేఉ ఉంటుంది. రెండవ ఈతలో ఉన్న ఆవును పాలిచ్చే సమయంలో మొదటి నెలలో కొనడం మంచిది. సంకరజాతి ఆవులలో జెర్సీ జాతి ఆవులు మన దేశ వాతావరణానికి తట్టుకోగలవు.
పోషణ ఎలా?
-పచ్చిమేత, ఎండుగడ్డి, దాణా మిశ్రమాన్ని తగిన పరిమాణంలో అందజేయాలి
-సుమారు 25 కిలోల నేపియరు, జొన్న లాంటి పచ్చిమేతతో సంకరజాతి ఆవుకు కావాల్సిన మాంసకృత్తులు, శక్తినిచ్చే పోషకపదార్ధాలు సమకూరుస్తాయి.
-ఖనిజలవణ లోపాలను సవరించుకునేందుకు కొట్టాలలో ఉప్పురాళ్లను వేలాడదీయాలి.
-ఎల్లప్పుడూ చల్లటి తాగునీటిని అందుబాటులో ఉంచాలి.
Share your comments