ఏకపంట కంటే మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించక, లేదా ఏమైనా కారణాల వలన ఒక పంట పాడైతే రెండో పంట రైతులను ఆదుకుంటుంది. అదేవిధంగా ఆక్వా రైతులకు కూడా మిశ్రమ వ్యవసాయం ఒక వరం వంటిది, అని చెప్పవచ్చు. ఎందుకంటే సంవత్సరం మొత్తం శ్రమించి చేపలు లేదా రొయ్యలు సాగు చేస్తే, కొన్ని రకాల తెగుళ్ల రైతుల కష్టానికి ప్రతిఫలం లేకుండా చేస్తున్నాయి.
ఆక్వా రైతులు మంచి నీటి చెరువుల్లో ఎక్కువుగా బోట్చే, రోహు, మ్రిగాల్, మరియు బంగారు తీగ వంటి చేపలను ఎక్కువుగా సాగు చేస్తారు. ఇటువంటి రైతులు, చేపలతో పాటు రొయ్యలను కూడా మిశ్రమ వ్యవసాయంగా సాగు చేస్తే అధిక లాభాలు సాధించవచ్చని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఒకే రకం రకం చేపలు కాకుండా 2-3 రకాల చేపలను సాగు చెయ్యడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. చెరువులోని ఒక్కో భాగంలో ఒక్కో రకం చేపలు పెరుగుతాయి, కొని చెరువు అడుగు భాగాన పెరిగితే మరొకిన్ని చెరువు మధ్య లేదా పైభాగంలో బాగా పెరుగుతాయి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వివిధ రకాల చేపలను ఒకే చెరువులో పెంచవచ్చు. చేపలతో పాటు రొయ్యలను కూడా జత చేస్తే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి నీటి చెరువులో పెరిగే చేపలకు ఒక్కో రకానికి వివిధ ఆహారపు అలవాట్లు ఉంటాయి. చెరువు ఉపరితలం మీద పెరిగే బొచ్చె చేపలు, జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకుంటాయి, అదే గండి చేపలు చెరువు మధ్య భాగంలో జీవిస్తూ, వృక్ష ప్లవకాలను ఆహారంగా తీసుకుంటాయి. అదేవిధంగా మోసు లేదా బంగారు తీగ రకాలు చెరువుకు అడుగు భాగంలో జీవిస్తూ కుళ్ళిన సేంద్రియ పదార్ధాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ విధంగా చేపలకు వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉంటాయి.
చేపలతో పాటు రొయ్యలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చేపలను సాగు చేసేవారు, జన్యుపరంగా అభివృద్ధి చేసిన స్కాంపి రొయ్యలను కూడా సాగు అయితే స్కాంపి రొయ్యలను మిశ్రమ పద్దతిలో సాగు చేసే రైతులు, చెరువు అడుగు భాగాన పెరిగే మోసు లేదా బంగారు తీగ వంటి చేపలను సాగు చెయ్యకూడదు, ఎందుకంటే స్కాంపి రొయ్యలు కూడా చెరువు అడుగు భాగాన, కుళ్ళిన సేంద్రియ పదార్ధాలను తింటాయి. ఈ మిశ్రమ సాగు ద్వారా ఒక ఎకరానికి దాదాపు 3000 చేపల వరకు సాగు చెయ్యవచ్చు, వీటిలో గండి చేపలు 1750-2000 వరకు సాగు చెయ్యవచు, అదేవిధంగా బొచ్చె చేపలు 500-750 వరకు సాగు చెయ్యవచ్చు. వీటితోపాటు చెరువు అడుగు భాగాన జీవించే స్కాంపి రొయ్యలను ఎకరాకు 6000-10000 వరకు సాగు చెయ్యడం ద్వారా రైతులు ఎక్కువ లాభాలను పొందేందుకు వీలుంటుంది, రొయ్యల సాగు వలన మరొక్క ప్రయోజనం ఏమిటంటే, వీటి నుండి కేవలం ఆరు నెలల్లోనే దిగుబడి చేతికి వస్తుంది, దీనితోపాటుగా మేత విషయంలో సరైన శ్రద్ద తీసుకుంటే 10 రొయ్యలు ఒక కిలో వరకు బరువు వచ్చే అవకాశం ఉంటుంది.
Share your comments