పాడి పశువుల పెంపకంలో పోషణ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. పచ్చి మేతను కొదవ లేకుండా మేపినప్పుడే రైతుకు పోషణ వ్యయం తగ్గి పరిశ్రమ గిట్టుబాటు అవుతుంది.అయితే పశుగ్రాసాలను మేపే క్రమంలో అసలు ఎలాంటి పశుగ్రాసాలు మేపాలి, తొలకరిలో వేసుకోవడానికి ఏ పశుగ్రాసాలు అణువుగా ఉంటాయి, ఏడాది పొడవునా పచ్చిమేత లాభ్యం కావాలంటే ఏమి సాగు చేయాలి అనేది తప్పక తెలిసి ఉండాలి.
తెలంగాణలో పశుగ్రాసాల సాగుకు కేటాయించే స్థలం తక్కువగా ఉంది కాబట్టి రైతులు ఎక్కువగా నష్టాలు అనేది చవిచూస్తున్నారు. అలా కాకుండా సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటించినట్లయితే అధిక ఆదాయము ఉత్పత్తి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక హెక్టారు భూమిలో ఆరుతడి కింద ఒక సమగ్ర వ్యవసాయపు నమూనాను చేయడం జరిగింది దీని మీద పరిశోధనలు జరిపినప్పుడు ఒక హెక్టారు భూమిలో 70 శాతం విస్తీర్ణం పంటల కింద , 20 శాతం ఉద్యాన పంటల కింద పది శాతం విస్తీర్ణం రెండు ఆవులు, 20 గొర్రెలు అదేవిధంగా 200 కోళ్ళని ఏర్పాటు చేసినప్పుడు ఒక హెక్టార్లో 2,55,000 నికర ఆదాయం అనేది రావడం జరిగింది . అయితే ఈ సమగ్ర వ్యవసాయంలో చేపట్టినప్పుడు వాటిని వాటికి తప్పనిసరిగా పశుగ్రాసం అనేది సంవత్సరం అంతా కూడా అందించవలసి ఉంటుంది.
అయితే ఈ సమగ్ర వ్యవసాయంలో డైరీ పాడి పశువులు కానీ జీవాలను పెంపకం గాని చేపట్టినప్పుడు వాటికి తప్పనిసరిగా పశుగ్రామం అనేది సంవత్సరం అంతా అందించవలసి ఉంటుంది. ఒక్క పాడి పశువులకు రోజుకు 30 కేజీల పచ్చి గడ్డి, 6 కిలోల ఎండు గడ్డి , మూడు కిలోల దాన అనేది అవసరం ఉంటుంది. ఈ 30 కిలోల పచ్చి గడ్డిలో 20 కిలోలు ధాన్యపు జాతి గడ్డి మరియు 10 కిలోలు లెగ్యూమ్ గడ్డి ని అందించవలసి ఉంటుంది. దీనికిగాను ఒక అర ఎకరంలో పశుగ్రాసాలు వేసుకోగలిగితే అంటే ఒక పావు ఎకరం ధాన్యపు జాతి కింద మరోపావుకరం లెగ్యూమ్ జాతి కింద వేసుకోవలసిన అవసరం ఉంటుంది. అలాగే మేకలు గాని గొర్రెల పెంపకం చేపట్టినప్పుడు పాక్షిక సాంద్ర పద్ధతిలో పెంచుకున్నట్లయితే పశుగ్రాసాలు పెంచడం తప్పనిసరి. ఒక గొర్రెకు రోజుకు 5 కిలోల పచ్చిగడ్డి అందులో నాలుగు కిలోలు ధాన్యపు జాతి ఒక కిలో లెగ్యూమ్ గడ్డి అనేది అవసరం అవుతుంది. దీనికిగాను ఒక 20 గొర్రెలను ఏర్పాటు చేసుకుంటే ఒక పావు ఎకరంలో దాన్యపుజాతి మరో పావు ఎకరంలో లెగ్యూమ్ జాతి గడ్డి అనేది అవసరం. పశుగ్రాసాల లభ్యత చూసుకున్నట్లయితే చాలా రకమైన పశుగ్రాసాలు వేసుకోవడానికి లభ్యంగా ఉన్నాయి . ముఖ్యంగా ధాన్యపు జాతి పశుగ్రాసం లో జొన్న గాని సజ్జ గాని మొక్కజొన్న గాని ఇవి కాయ జాతి లేక లెగ్యూమ్ జాతి లో అలసంద, బొబ్బర , హెడ్జ్ లూసర్న్ వంటి పశుగ్రాసాలు లభ్యంగా ఉన్నాయి. అలాగే చెట్ల పశుగ్రాసాల్లో సుబాబుల్ , అవిస, గట్ల మీద పెంచుకొని వాటి రెమ్మలను మేతగ ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి
పాడి రైతులకు శుభవార్త: ఆవు-గేదెలకు క్రెడిట్ కార్డ్, గ్యారెంటీ లేకుండా 3 లక్షల రుణ సౌకర్యం.
గడ్డి జాతి పశుగ్రాసాల్లో హైబ్రిడ్ బాజ్ర నేపియర్, ఇందులో రకాలు కో-4,5, సూపర్ నేపియర్, ఏపీ బీఎన్ వన్ 1 వంటి గడ్డి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇతర గడ్డి రకాలు అంజన్ గడ్డి, పార గడ్డి ని కూడా సాగు చేసుకోవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వారు హైబ్రిడ్ బాజ్ర లో ఏపీ బి ఎన్ వన్, అలసందలో విజయ రకాన్ని, సజ్జల లో మోతీ బాజ్ర వంటి రకాలను యూనివర్సిటీ వారు విడుదల చేయడం జరిగినది. గడ్డి జాతి పశుగ్రాసాల్లో హైబ్రిడ్ బాజ్ర నేపియర్ చాలా ముఖ్యమైనది.
ఇందులో సూపర్ నేపియర్ రకం లో 12,000 కాండపు ముక్కలు ఎకరానికి నాటుకోవాలి. వీటిని పొలంలో ఓదలికి ఒక పక్కగ ఏటవాలుగా నాటుకోవాలి. అంటే 45 డిగ్రీల కోణంలో నాటుకోవాలి. బోధ కి బోధకి మధ్యలో 60 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక హెక్టారుకు 30 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాషియం ఎరువులు కావలెను. నాటిన తర్వాత 70 రోజుల నుంచి కోతకు సిద్ధంగా ఉంటుంది. మొదటి కోత తరువాత 40-45 రోజులకు ప్రతి ఒక్క కోత తీసుకోవచ్చు. సంవత్సరానికి ఎకరాకు 60 టన్నుల పచ్చి గడ్డి లభిస్తుంది. దీనికి కొద్దిపాటి నీరు తడి అవసరం ఉంటుంది.
అలాగే ఏక వార్షికాలు అయినా మొక్కజొన్న, జొన్నలు వేసుకోవచ్చు. జొన్నలలో రెండు నుంచి మూడు కోతలు వచ్చే వంటి పశుగ్రాస రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో సి ఎస్ హెచ్ 24 ఎంఎఫ్ అనే రకం రెండు నుంచి మూడు కోతల వరకు వస్తుంది. ఎకరాకి 10 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఎకరాకు 30 కిలోల నట్రజని, 50 కిలోల భాస్వరం , 30 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు అవసరం ఉంటుంది. జొన్నలలో 50 శాతం పూత దశలో కోసుకోవాలి. మల్టీకట్ రకాలు లొ ప్రతి 45 రోజులకు కోత తీసుకోవచ్చును. సంవత్సరానికి ఒక ఎకరం నుంచి 16 నుంచి 20 టన్ ల పచ్చి గడ్డి లభ్యమవుతుంది.
మేత మొక్కజొన్న రకాలలో ఆఫ్రికన్ టాల్, గంగా సగెడ్ 2. ఇది ఒకేసారి మనకి కోతకు లభ్యమవుతుంది. ఎకరాకి 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే విధంగా ఎరువులు ఒక హెక్టార్ కి 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాషియం అవసర పడుతుంది. పాలకంకి దశలో మొదటి కోత కోయడం అనేది చేయాలి. సంవత్సరానికి ఒక ఎకరానికి 20 టన్ ల పచ్చి గడ్డి లభ్యమవుతుంది.
సజ్జలలో మోతి బాజ్ర, రజ్కో బాజ్రా వంటి రకాలు ఉన్నాయి. ఎకరాకి 10 నుంచి 12 టన్నుల పచ్చి గడ్డి ఒక సంవత్సరంలో లభ్యమవుతుంది. లెగ్యూమ్ లేదా కాయ జాతి లో ఎహెడ్జె లూసర్న్ లేద లూసర్న్ ఉన్నాయి. ఎహెడ్జె లూసర్న్ ఎకరానికి 7 నుంచి 8 కిలోల విత్తనం అనేది అవసరం. హెక్టార్ కి 20 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఎరువులు అవసరం. 90 రోజులకు కోతకు వస్తుంది. ఐదు నుంచి ఆరు కోతలు ఒక సంవత్సరంలో వస్తాయి. ఎకరానికి 50 టన్నుల పశుగ్రాసం వస్తుంది. ఇలాంటి పశుగ్రాసాలు పెంచినట్లయితే పచ్చి గడ్డి లభ్యత అన్ని సమయాలలో పశువులకు మేతగా అందుబాటులో ఉంటుంది. తద్వారా రైతుకు అధిక లాభo అనేది చేకూరుతుంది.
ఇది కూడా చదవండి
Share your comments