వ్యవసాయ అనుబంధంగా రైతులకు మూగ జీవాల పెంపకం ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. వాటిలో గొర్రెల పెంపకం లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే ఇతర మూగ జీవాల పెంపకానికి చేయాల్సిన ఖర్చుతో పోల్చుకుంటే గొర్రెల పెంపకానికి తక్కువ మొత్తంలోనే ఖర్చు అవుతుంది. అలాగే, నేలపై ఉన్న గడ్డీ, కలపు మొక్కలను మేస్తాయి. కాబట్టి వీటి మేత కోసం చేయాల్సిన ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. అయితే, వర్షకాలంలో గొర్రెలకు పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వర్షకాలంలో గొర్రెలకు వచ్చే ప్రధాన వ్యాధులలో నీలి నాలుక వ్యాధి ఒకటి. వర్షాలు అధికంగా పడుతుతున్న సమయంలో ఈ వ్యాధి సంక్రమణ జరుగుతుంది. వైరస్ కారణంగా వచ్చే ఈ నీలి నాలుక వ్యాధి ఏడాదిలో ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో అధికంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో గొర్రెల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నీలి నాలుక వ్యాధి లక్షణాలు
నీలి నాలుకు వ్యాధి సోకిన గొర్రెలకు ముఖం వాపుతో పాటు పుండ్లు ఏర్పడతాయి. అలాగే, గొర్రె మూతి, పెదవులు, చిగుళ్లు, నాలుక వాపుతో పాటు వీటిపై కూడా పుండ్లు ఏర్పడతాయి. తీవ్రమైన జ్వరం కూడా ఉంటుంది. నోటి ద్వారా దుర్వాసన అధికంగా వస్తుంది. వ్యాధి మరింత ముదిరితే నాలుక నీలి రంగులోకి మారుతుంది. ఈ సమయంలో మేత సరిగ్గా తినలేవు. ఈ వ్యాధి సోకిన గొర్రెలు చనిపోయే ప్రమాదమూ ఎక్కువే.
నివారణ చర్యలు
గొర్రెలకు నీలి నాలుక వ్యాధి సోకకుండా ఉండాలంటే వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమలను నివారణ చర్యలు తీసుకోవాలి. గొర్రెల షెడ్ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యాధి సోకితే యాంటి బయాటిక్ మందులు వాడాలి. మేతను మేయలేవు కాబట్టి మరణమప్పును తగ్గించడానికి అంబలితో పాటు రాగి గంజిని అందించాలి. పుండ్లు ఏర్పడిన ప్రాంతంలో ఒక శాతంతో ఉన్న పోటాషియం పర్మాంగనేట్‌ను పుండ్లపై రుద్దలి. ఇతర మందులు కూడా వాడుకోవచ్చు. వ్యాధి సోకిన గొర్రెలను వేరుగా ఉంచడం వల్ల మిగతా వాటికి ఇది వ్యాపించకుండా ఉంటుంది.
Share your comments