Animal Husbandry

ఓక్లాండ్ జూలో వినూత్న ప్రయోగం... జంతువులకు కరోనా వ్యాక్సిన్!

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మనుషుల పై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ జంతువులలో కూడా చూపుతుందని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కో బే ఏరియా వద్ద ఉన్న ఓక్లాండో జూలో ఉన్న జంతువుల ఆరోగ్య విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలను పాటించారు.ఈ క్రమంలోనే ఈ జూలో ఉన్నటువంటి జంతువులకు కరోనా వ్యాప్తి చెందకుండా జూ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ జంతువుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కరోనా టీకాలను జంతువులకు ఇస్తున్నారు .

ఇప్పటివరకు మనం కరోనా వ్యాక్సిన్ మనుషులకు మాత్రమే ఇవ్వడం చూస్తాం కానీ ఇకపై జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఓక్లాండ్ జూలోని సింహాలు పులులు ఎలుగుబంట్లు వంటి తదితర జంతువులకు అధికారులు కరోనా టీకాలను వేసినట్లు అక్కడ వైద్య సేవలు అందించే డాక్టర్​ అలెక్స్​ హెర్మాన్​ వెల్లడించారు. జూలోని జంతువులను వాటి రోగ నిరోధక శక్తి ఆధారంగా టీకాలు ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

జంతువుల కోసం ప్రత్యేకంగా కరోనా టీకాలను న్యూజెర్సీలోని జోయిటీస్​ అనే వెటర్నరీ ఫార్మాస్యూటికల్ సంస్థ ప్రత్యేకంగా జంతువుల కోసమే ఈ టీకాను కనుగొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అలెక్స్ మాట్లాడుతూ మనుషులలో వ్యాప్తి చెందిన విధంగానే కరోనా వైరస్ జంతువులలో కూడా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచించడంతో ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండటం కోసం ముందస్తు జాగ్రత్తగా వైరస్ కి వ్యతిరేకంగా జంతువులకు టీకాలు అందిస్తున్నట్లు డాక్టర్ అలెక్స్ తెలిపారు. ఈ జూ లో ఉన్నటువంటి జంతువులకు వ్యాక్సిన్లు అందించడం మాత్రమే కాకుండా సామాజిక దూరం పాటించే విధంగా తగిన జాగ్రత్తలను జూ అధికారులు తీసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

Share your comments

Subscribe Magazine