Animal Husbandry

పాడి పరిశ్రమ లో సిరులు కురిపించే 5 గేదె జాతులు !

Srikanth B
Srikanth B

ప్రపంచంలోనే అత్యధికంగా గేదెలు భారతదేశంలో ఉన్నాయి ,దానికి గల కారణం భారతదేశంలో సగానికి పైగా ప్రజలు పశుపోషణ ద్వారా తమ జీవనోపాధిని పొందుతున్నారు.భారతదేశంలో సుమారు 26 జాతుల గేదెలు ఉన్నాయి . కానీ ఇప్పటికీ, ఈ 26 జాతులలో, కేవలం 12 జాతులను మాత్రమే పశువుల కాపరుల సోదరులు తమకు అనుకూలంగా పెంచుతున్నారు. గేదెలలో ఎక్కువ భాగం భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పెంచబడుతున్నాయి.

మీరు కూడా కొత్తగా పాడి  పరిశ్రమ ప్రారంబించాలనుకుంటే  ఎక్కడ మేము మీకు భారతదేశమే లోనే అధిక పాల్దిగుబడినిచే గేదె జాతుల ను గురించి వివరిస్తాము..

5 అత్యుత్తమ గేదె జాతులు :(Top 5 Buffalo breed in India )

ముర్రా  (Murra Buffalo )

గేదెలలో, ముర్రా జాతి గేదెలు ఉత్తమ గేదెలుగా పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే ఈ గేదె అత్యధిక పాలు ఉత్పత్తి  సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ చూసినట్లయితే, దాని సగటు ఉత్పత్తి సామర్థ్యం నెలకు 1750 నుంచి 1850  లీటర్ల వరకు ఉంటుంది. అంతే కాదు, ముర్రా గేదె పాలలో సుమారు 9 శాతం కొవ్వు ను కల్గి ఉంటుంది .

ముర్రా జాతికి చెందిన గేదె పొడవుగా, వెడల్పుగా మరియు చక్కటి శరీరాకృతిని కల్గి ఉంటాయి. ఇది భారతదేశంలోని హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాలలో ఎక్కువగా పెంచబడుతుంది.

పండర్ పురి గేదె((Pandharpuri Buffalo)

మహారాష్ట్రలోని సోలాపూర్, కొల్హాపూర్, రత్నగిరి జిల్లాల్లో ఈ జాతికి చెందిన గేదెలను ఎక్కువగా పెంచుతారు. ఇది నెలకు సుమారు 1700 నుంచి 1800 వరకు పాలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని పాలలో 8 శాతం వరకు కొవ్వు కూడా ఉంటుంది. ఈ గేదె యొక్క బాహ్య లక్షణాలు  , అది కనిపించడంలో చాలా అందంగా ఉంటుంది. దీని కొమ్ములు 45 నుంచి 50 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ గేదె యొక్క మొత్తం బరువు సుమారు 450 నుంచి 470 కిలోలు మరియు ఈ గేదె నలుపు రంగులో ఉంటుంది.

సుర్తి గేదె (surti buffalo)

ఈ జాతికి చెందిన గేదెను గుజరాత్ కు చెందిన పశువుల కాపరు సోదరులు పెంచుతారు. దీని పాలు ఉత్పత్తి  సామర్థ్యం నెలకు 900 నుంచి 1300 లీటర్లు మరియు దీనిలో 8 నుంచి 12 శాతం కొవ్వు ఉంటుంది.

చిల్కా బఫెలో (chilak buffalo

చిల్కా జాతికి చెందిన ఒక గేదె భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇది నెలకు  సుమారు 500 నుంచి 600 కిలోల పాలు ఉత్పత్తి  సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనిని మీరు మార్కెట్ లో విక్రయించడం ద్వారా మంచి లాభాన్ని పొందవచ్చు. ఈ గేదె యొక్క రంగు గోధుమ మరియు నలుపు రంగులో ఉంటుంది.

మెహ్సానా బఫెలో (Mehsana Buffalo)

ఈ జాతికి చెందిన గేదెలు గుజరాత్ మరియు మహారాష్ట్రలలో ఎక్కువగా కనిపిస్తాయి. సగటు పాలు ఉత్పత్తి  సామర్థ్యం నెలకు 1200 నుంచి 1500 లీటర్లు. ఈ జాతి ముర్రా లాగా కనిపిస్తుంది. కానీ ఇది ముర్రా గేదెలా బరువు ఉండదు, ఇది బరువు తక్కువగా ఉంటుంది. ఇది 560 నుండి 480 కిలోల వరకు ఉంటుంది. దీని రంగు నలుపు రంగులో ఉంటుంది.

రోజుకు 33. 8 లీటర్ల పాలు చరిత్ర సృష్టించిన గేదె !

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More