Animal Husbandry

గొర్రెల‌కు గొంతు వాపు వ్యాధులు వస్తాయని మీకు తెలుసా?

KJ Staff
KJ Staff

నెరుడు వాపు: గొర్రెలు అకస్మాత్తుగా చ‌నిపోవ‌డం, తీవ్రమైన జ్వరంతో ఉండ‌టం, శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ప‌డ‌టం, తూలి పడుతుండ‌టం, కాళ్ళు పడిపోవడం, ఉన్నట్లుండి కుప్పకూలి పోయి చ‌నిపోవ‌డం, ఇక చనిపోయిన జీవాల్లో నోరు, చెవులు, ముక్కులు, మలద్వారం, యోని నుండి నల్లని రక్తం గడ్డకట్టకుండా కారిపోతుండ‌టం. గ‌మ‌నిస్తే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి. ఇలాంటి వ్యాధితో గొర్రెలు చనిపోతే వాటి శరీరం త్వరగా ఉబ్బిపోయి కుళ్ళి పోతుంది. దీని నివార‌ణ‌కు వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ప్రతీ ఏడాది టీకాల‌ను గొర్రెల‌కు వేయించాలి. మీ ప్రాంతంలో ఆంత్రాక్స్‌ వ్యాప్తి చెందినట్లు వార్త వ‌స్తే వెంటనే మీ అన్ని ప‌శువుల‌కు టీకాలు వేయించాలి. దీనికి సంబంధించిన టీకామందును 1 మి.లీ. చర్మం క్రింద ఇవ్వాల్సి ఉంటుంది.

ఊపిరితిత్తులో నెమ్ము: గొర్రెల‌కు జ్వరం, దగ్గు, ముక్కు నుంచి చీమిడి లేదా నీరు కారుతుండ‌టం, ఎగశ్వాస, రాత్రులందు మంద దగ్గరకు వెళితే ఎక్కువ గొర్రెలు దగ్గుతూ క‌నిపించ‌డం లాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. దీని నివార‌ణ‌కు జీవాలుండే పాకను పొడిగా, గాలి, వెలుతురు సమృద్ధిగా సోకేటట్లు నిర్మించాల్సి ఉంటుంది. అలాగే దగ్గుతున్న జీవాలను గుర్తించాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా వీటికి చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఫుట్‌రాట్‌: ఈ వ్యాధి సోకిన జీవాలు కుంటడం, గిట్టలు మెత్తపడటం, గిట్టల సందులో పుళ్ళు, దుర్వాసన, జ్వరం తీవ్రంగా వచ్చినపుడు గిట్టలు ఊడిపోవడం జ‌రుగుతుంది. అలాగే రెండుకాళ్ళకు వ్యాధి సోకినపుడు మోకాళ్ళమీద నిలబడటం చేస్తుంటాయి. దీని నివార‌ణ‌కు పాకలో చిత్తడి లేదా రొచ్చు లేకుండా చూడాల్సి ఉంటుంది. బురద లేదా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో గొర్రెల‌ను మేప‌కూడ‌దు.

గొంతువాపు: ఈ వ్యాధి సోకిన గొర్రెలు తల, గొంతు, ఛాతి బాగాల్లో చర్మం క్రింద నీరు చేర‌డం వ‌ల‌న ఆ ప్రాంతం పూర్తిగా వాచిపోయి ఉంటుంది. అలాగే నోరు, కళ్ళు, ముక్కు నుండి ఎక్కువగా లాలాజలం కారుతూ క‌నిపిస్తుంది. దీని నివార‌ణ‌కు సల్ఫాడిమిడిన్ లేదా సోడియం సల్ఫాడిమిడిన్‌ కిలో బరువుకు 150 మి.గ్రా. చొప్పున సిర లోకి ఇవ్వాల్సి ఉంటుంది. అయినా కానీ తగ్గకపోతే 24 గంటల తర్వాత ఈ మందునే మ‌ళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే టెట్రాసైక్లిన్‌ కిలో బరువుకు 5-10 మి.గ్రా. చొప్పున సిర లోనికి మొదటి 3 రోజులు ఇవ్వాలి. తరువాత కండరాల్లోకి 3 రోజులు ఇవ్వాలి. ఈ గొంతువాపు వ్యాధి టీకాను 2.5 మి.లీ. చొప్పున ఆరునెలలు పైబడిన పశువుల్లో ప్రతీ ఆరు నెలలకు ఒక‌సారి ఇవ్వాల్సి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine