గ్రీన్ ఎనర్జీ మరియు పర్యావరణ సారథ్యం పట్ల నిబద్ధత వైపు అత్యున్నత చర్యల్లో భాగంగా, హెచ్.పి.సి.ఎల్., రాజస్థాన్ లోని సంచోర్ లో ఆవు పేడతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. వేస్ట్ టు ఎనర్జీ పోర్ట్‌ఫోలియో కింద హెచ్.పి.సి.ఎల్. చేపట్టిన మొదటి ప్రాజెక్టు ఇది. బయో గ్యాస్ ఉత్పత్తి చేయడానికి రోజుకు 100 టన్నుల పేడను ఉపయోగించాలని ప్లాంట్ ప్రతిపాదించింది. దీనిని ఆటోమోటివ్ ఇంధనంగా ఉపయోగించవచ్చు. ఒక ఏడాది వ్యవధిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రతిపాదించారు.గోబర్-ధన్ పథకం కింద ఈ ప్రాజెక్టు ను అభివృద్ధి చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం రాజస్థాన్ రాష్ట్రం, సంచోర్ తహశీల్, జాలోర్ జిల్లా, పథ్ మెడ గ్రామంలోని శ్రీ గోధామ్ మహాతీర్థ్ పథ్ మెడ లోక్ పుణ్యార్థ్ న్యాస్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో బయో-ఫ్యూయల్ మరియు రెన్యూవబుల్స్ సంస్థ, ఈ.డి., శ్రీ శువేందు గుప్తా తో పాటు హెచ్.పి.సి.ఎల్. కు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
బ్రిటిష్ పాలనలో భారతదేశం నుండి దొంగిలించబడిన 7 కళాఖండాలను UK తిరిగి ఇవ్వనుంది
పరిశుభ్రతను సానుకూలంగా ప్రభావితం చేయడంతో పాటు పశువులు, సేంద్రీయ వ్యర్థాల నుంచి సంపద మరియు శక్తిని ఉత్పత్తి చేయడం కోసం, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కాంపోనెంట్ లో భాగంగా, భారత ప్రభుత్వం 2018 ఏప్రిల్ నెలలో ప్రారంభించిన గోబర్-ధన్ పథకం కింద ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయబడుతోంది.
Share your comments