Animal Husbandry

కోళ్ల ఫారం... రైతులకు లాభదాయకం.. ఎలా అంటే?

KJ Staff
KJ Staff
Poultry Farming
Poultry Farming

దేశ జనాభా ప్రకారం చూస్తే... ప్రస్తుతం ఒక్కో మనిషి ఏడాదికి 54 గుడ్లే (పర్‌కాప్టియా ) అందుబాటులో ఉంటున్నాయి. అలాగే 2.2 కిలోల చికెన్‌ మాత్రమే అందుబాటులో ఉంటోంది. అయితే ఒక్కో వ్యక్తి 180 గుడ్లు, 10.8 కిలో చికెన్‌ తింటే మంచిది అని ఐసీఎంఆర్‌ ఇటీవల తెలిపింది. దీనిబట్టి కావాల్సినంత చికెన్‌, గుడ్లు అందుబాటులో లేవని అర్థమవుతోంది. ప్రజలకు అవసరమైన స్థాయిలో గుడ్లు, చికెన్‌ అందించాలంటే పౌల్ట్రీ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది.
Article
దేశంలో వ్యవసాయం ప్రాముఖ్యత ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ, ఎప్పటికీ తొలి స్థానంలోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆహారోత్పత్తితోపాటు, పౌల్ట్రీ కూడా క్రమేణా ప్రాముఖ్యత సంతరించుకుంటూ వస్తోంది. గత నాలుగైదు దశాబ్దాల నుండి చూస్తే... భారతదేశ పౌల్ట్రీ రంగం చాలా మారిపోయింది. పాత తరం పౌల్ట్రీ వ్యవసాయం నుండి అత్యాధునిక పద్ధతుల్లోకి వచ్చేశారు. పౌల్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఏటా 2.75 మిలియన్‌ టన్నుల చికెన్‌, 65.48 మిలియన్‌ గుడ్లు వస్తున్నాయి. అలాగే 30 లక్షలమంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు ఈ మొత్తం వ్యాపారం రూ. 45,416 కోట్లు గా లెక్కించారు.

ప్రపంచ పౌల్ట్రీ మార్కెట్‌ లెక్కలు చూస్తే... ప్రపంచంలో ఏటా 104 మిలియన్‌ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. అందులో చికెన్‌ వంతు 87.4 శాతం కాగా, టర్కీ కోడి మాంసం శాతం 6.6గా ఉంది. బాతు మాంసం శాతం 4.2 కాగా, గీస్‌ శాతం 2.7గా ఉంది. గుడ్లు విషయంలో మొత్తం ప్రపంచ మార్కెట్‌ చూస్తే చైనానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొత్తంగా 37.6 శాతం ప్రొడక్షన్‌తో తొలి స్థానంలో ఉంది. అమెరికా వాటా 8.5 శాతం కాగా, భారతదేశ వాటా ఐదు శాతంగా ఉంది.

దేశంలో ఆరోగ్య పరిస్థితులు మారడంతో ప్రజలు ప్రొటీన్‌ ఫుడ్ మీద దృష్టిసారించారు. మరోవైపు ఆర్గానిక్‌ పౌల్ట్రీ ఉత్పత్తి ప్రస్తుతం ప్రపంవ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. ఆర్గానిక్‌ ఉత్పత్తుల కోసం ప్రజలు ఎంత డబ్బైనా వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఆర్గానిక్‌ ఉత్పత్తుల తయారీని పెంచుకొని లాభాలు ఆర్జిస్తున్నారు.


దేశ జనాభా ప్రకారం చూస్తే... ప్రస్తుతం ఒక్కో మనిషి ఏడాదికి 54 గుడ్లే (పర్‌కాప్టియా ) అందుబాటులో ఉంటున్నాయి. అలాగే 2.2 కిలోల చికెన్‌ మాత్రమే అందుబాటులో ఉంటోంది. అయితే ఒక్కో వ్యక్తి 180 గుడ్లు, 10.8 కిలో చికెన్‌ తింటే మంచిది అని ఐసీఎంఆర్‌ ఇటీవల తెలిపింది. దీనిబట్టి కావాల్సినంత చికెన్‌, గుడ్లు అందుబాటులో లేవని అర్థమవుతోంది. ప్రజలకు అవసరమైన స్థాయిలో గుడ్లు, చికెన్‌ అందించాలంటే పౌల్ట్రీ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కనీసం పదింతలు సామర్థ్యం పెరగాలి. అదే స్థాయిలో కోళ్లకు దాణా ఉత్పత్తి కూడా పెరగాలి. ఓ పరిశోధన ప్రకారం 2050 నాటికి దేశంలో 77 మిలియన్‌ టన్నుల దాణా (ముడి ఆహారం) అవసరం. దీని ప్రకారం ముడి ఆహారం ఉత్పత్తిని పెంచాలి. అలాగే కొత్త తరహా ముడి ఆహారం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పౌల్ట్రీ రంగంలో వృద్ధి కనిపిస్తుంది.

పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో బయో రక్షణ అనేది కీలక అంశం. దీనిపై కూడా దృష్టి సారించాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. కోళ్లను ఆరోగ్యం కాపాడుకునేలా ఎప్పటికప్పుడు బయోలాజికల్‌ ఏజెంట్లను సిద్ధం చేసుకోవాలి. కోళ్లను అనారోగ్యం చేయకుండా అన్ని రకాల మందులు సిద్ధం చేసుకోవాలి. బ్యాక్టీరియా, పారాసైట్స్‌, వైరస్‌లు లాంటివి సోకకుండా చూసుకోవాలి. క్వారంటైన్‌ ఏర్పాట్లు, వ్యాక్సిన్‌ లాంటివి సిద్ధం చేయించుకోవాలి. గతంలో కోళ్లకు వైరస్‌లు చోకి పౌల్ట్రీ వ్యవసాయం భారీగా నష్టపోయిన సందర్భాలు చూశాం.

ప్రాసెస్డ్‌ చికెన్‌ విధానం ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగింది. అర్బన్‌ మార్కెట్స్‌ ఇది ఎక్కువగా కనిపిస్తోంది. శుభ్రమైన ఆహారం, శుచికరమైన ఆహారం విషయంలో వినియోగదారుల అవగాహన పెరిగింది. దీంతో పౌల్ట్రీలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అనేది కీలకంగా మారింది. దీంతో ప్రాసెసింగ్‌ పరిశ్రమకు భవిష్యత్తు బాగుండేలా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా సంస్థలు ఎగ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే దీని సంఖ్యను ఇంకా పెంచే అవకాశమూ ఉంది. అయితే ప్రాసెసింగ్‌ కోసం వాడే ముుడి సరుకు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తుది ఉత్పత్తి అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా ఉందా లేదా అనేది చూసుకోవాలి.

ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న మాసంలో 38 శాతం గ్రామీణ, కొండ ప్రాంతాల నుండే వస్తోంది. అలాగే ఆ ప్రాంతాల్లోని ఉత్పత్తి సగటు ఏడాదికి 50 నుండి 60 గుడ్లు మత్రమే. దేశంలో ఉత్పత్తి అవుతున్న గుడ్లలో గ్రామీణ, కొండ ప్రాంతాల సగటు 21 శాతం మాత్రమే. అంతేకాదు ఆ ప్రాంతాల్లో గుడ్లు, మాంసం ధర ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో గుడ్లు, చికెన్‌ ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు. దాని వల్ల దేశంలో గుడ్లు, చికెన్‌ పర్‌ కాప్టియా పెరుగుతుందనేది ఓ అంచనా. అన్నట్లు గుడ్ల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉన్న చైనాలో గ్రామీణ ప్రాంతాల నుండి అత్యధికంగా 76 శాతం గుడ్లు వస్తున్నాయట.

మరోవైపు పౌల్ట్రీ రంగంలో సాంకేతికత వినియోగిస్తున్నప్పటికీ ఇంకాస్త పెంచుకుంటే ఉపయోగం ఉంటుంది. పౌల్ట్రీ వ్యవసాయాన్ని ఆటోమేటడ్‌ చేస్తే ఇంకా ఎక్కువ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ప్రస్తుతం వినియోగిస్తున్న జనరిక్‌ విధానాన్ని కొనసాగిస్తూనే టెక్నాలజీ వాడుకునేలా మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన కోళ్ల పెంపకానికి సాంకేతిక ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికి కొన్ని సంస్థలు అందుబాటులో ఉన్నాయి. పౌల్ట్రీ అంటే కేవలం కోళ్లు అనే కాకుండా బాతు, టర్కీ కోడి, క్వాయిల్‌ పెంపకాన్ని కూడా ప్రయత్నించొచ్చు. దీని వల్ల ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయమూ పెరుగుతుంది.

Share your comments

Subscribe Magazine