వేసవి కాలం ఇంకా ఆరంభ దశలో ఉన్నప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు మనుషులమీదనే కాకుండా పశుపక్షాదుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పాడి పశువులు పెంచేవారికి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పవచ్చు. మనుషులతో పాటు, పాడి పశువులుకూడా వడ దెబ్బ భారిన పడే అవకాశం లేకపోలేదు.
పశువులు వడ దెబ్బ భారిన పాడి పాలు ఉత్పత్తి చేసే శక్తిని కోల్పోతాయి. కొన్ని సందర్భాల్లో వడ దెబ్బకు గురైన పశువులు మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి. వేసవి కాలంలో ఉష్ణోగ్రత పెరిగి గాలిలో తేమ శతం తగ్గిపోవడం మూలాన పశువులు వడ దెబ్బ భారిన పడతాయి. తెల్లజాతి పశువులతో పోలిస్తే నల్లజాతి పశువులు ఈ వడ దెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. చాల మంది రైతులు సరిపడా స్థలం లేకనో మరేతర కారణాల వల్లనో చిన్న పశువుల పాకలోనే ఎక్కువ పశువులను ఉంచుతారు, ఇటువంటి పరిస్థితుల్లో సర్రిగ్గా గాలాడక పశువులు వడ దెబ్బకు గురవుతాయి. నీటి వసతి అంతంత మాత్రం ఉన్న ప్రాంతాల్లో, పశువులు ఎండల మూలంగా మరింత ఒత్తిడికీ లోనవుతాయి.
ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, శరీరం చెమటను శ్రవించి శరీరాన్ని చల్లబరుస్తుంది, శరీరం చెశరీరం మటను శ్రవించడానికి మెదడులో ఉండే హైపోథలామస్ అనే కారణం. అయితే వేసవి సమయంలో బయట ఉష్ణోగ్రతలు కంటే పశువుల శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటె, హైపోథలామస్ స్వేద రంద్రాల మీద నియంత్ర కోల్పోయి, చమట అధికమవుతుంది, తద్వారా పశువులు శరీరం నీటిని, ఎలెక్ట్రోలైట్లనూ కోల్పోతుంది. శరీర ఉష్ణోగ్రత అధికమవ్వడం మూలంగా, గుండె వేగం పెరిగి, పశువులు ఉక్కరిబిక్కిరి అవుతాయి. పరిస్థితి విషమిస్తే పశువులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.
వడదెబ్బ నుండి రక్షణ:
పాడి రైతులు ముందుగా, పశువుల షెడ్ నిర్మాణ సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. షెడ్ నిర్మాణం తూర్పు పడమర దిశలో జరిగేలా చూడాలి. పశువులు మధ్య కనీస దూరం ఉండేలా షెడ్ నిర్మాణం చేపట్టాలి. వేసవికాలంలో పశువులు సాధారణం కంటే అధికంగా నీటిని తాగుతాయి కనుక, ఎల్లవేళలా నీరు అందుబాటులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఉదయం 10 గంటలు దాటాక పశువులను ఎట్టిపరిస్థితిలోను మేతకు వదలకూడదు, ఉదయం 9 గంటలోపు సాయంత్రం మూడు గంటలు దాటినా తర్వాత మాత్రమే మేతకు వదిలిపెట్టాలి. రోజుకు కనీసం రెండు సార్లైనా పశువులను చల్లటి నీటితో కడగడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను కొంతవరకు తగ్గించవచ్చు. అవకాశం ఉన్నవారు, పశువులను చెరువులో ఈదనివ్వాలి. పగటిపూట షెడ్ లోపల అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి ఉష్ణోగ్రత తగ్గించాడనికి షెడ్ పైన వరి గడ్డి పరచి చల్లటి నీటిని చల్లాలి.
వడ దెబ్బ తగిలిన పశువులను గుర్తించడం ఎలా?
వడ దెబ్బ తగిలిన పశువుల చర్మం సున్నితత్వం కోల్పోయి గట్టిగ్గా తయారవుతుంది. శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారెన్ హీట్ల వరకు చేరుతుంది. కొన్ని సమయాల్లో పశువులు శరీరంపై నియంత్రణ కోల్పోయి తూలుతూ నడవడం గమనించవచ్చు, అటువంటి సమయాల్లో పశువులను చల్లని గాలి వీచే ప్రాంతాలకు తీసుకువెళ్లాలి, తాగునీటీని అందించి, శరీరాన్ని చల్లని నీటితో కడగాలి. పరిస్థితి విషమించక ముందే పశువైద్యున్ని సంప్రదించడం మంచిది. వడ భారిన పశువులకు సిలైనే ద్వారా గ్లూకోస్, ఎలెక్ట్రోలైట్స్ అందించడం ద్వారా పశువులు నీరసం నుండి కోలుకుంటాయి.
Share your comments