కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో పశు సంపదను పెంచి, పాడి రైతులను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి 'కృషి కళ్యాణ్ అభియాన్' (జాతీయ కృత్రిమ గర్భధారణ) కార్యక్రమం అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా పాల ఉత్పత్తులను పెంచేందుకు తగ్గట్టుగా పశు సంపదను రెట్టింపు చేసేలా ప్రయత్నిస్తుంది. ప్రభుత్వాలు కృత్రిమ గర్భధారణ పద్ధతిని మేలుజాతి పశు సంపద అభివృద్ధికి అనుసరిస్తున్నాయి. గత మూడు విడతల్లో 68,292 పశువులకు కృత్రిమ గర్భధారణ కోసం ఇంజక్షన్లు చేయగా రెండు విడతల్లో 6,822 దూడలు ఉత్పత్తి చెందాయి. సహజ గర్భధారణతో పోల్చితే కృత్రిమ గర్భధారణతో ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని పశు, సంవర్ధకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నాల్గో విడత కార్యక్రమాలు భద్రాద్రి జిల్లాలో నిర్విరామంగా సాగుతున్నాయి.
మొదట విడతగా 2019-2020 లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని 6 నెలలకు ఒకసారి భద్రాద్రి జిల్లా పశు సంవర్ధకశాఖ చేపడుతుంది. గత సంవత్సరం అక్టోబర్లో నాల్గో విడత కార్యక్రమాలను ప్రారంభించగా ఈ సంవత్సరం మర్చి నెల వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమం ద్వారా ఎదకు రాణి పశువులను అధికారులు గుర్తించి, వీర్యనాళిక ద్వారా ఆ పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు. పాడి రైతుకు రెట్టింపు ఆదాయం అందించడమే కాకుండా పశు సంపదను పెంచేందుకు ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఎదకు రాని పశువులను అధికారులు గుర్తించి రైతుల ఇంటికే వెళ్లి ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేసి ఎదకు వచ్చేలా చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అని తెలియజేసారు.
ఈ కృత్రిమ గర్భధారణ ప్రక్రియకు దేశివాళి జాతి ఎద్దులు, ముర్రా జాతి పశువుల్లో నుంచి వీర్యాన్ని సేకరించి ఇంజక్షన్ల ద్వారా ఎక్కిస్తారు. పశుగణాభివృధి సంఘం (డిఎల్డిఎ) ఈ కృత్రిమ గర్భధారణకు అవసరమైన ఘనీకృత వీరస్, లిక్విడ్ నైట్రోజన్, తదితర సామగ్రిని అందజేస్తుంది. ఎదకు రాని పశువులను గుర్తించిన పశు వైద్యులు పాడి రైతు ఇంటికెళ్లి ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ ప్రక్రియలో గోపాలమిత్ర, పశు సంవర్ధకశాఖ సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తారు. కృత్రిమ గర్భధారణ చేసిన పశువులకు విశిష్ట గుర్తింపు సంఖ్యతోపాటు చెవికి ట్యాగ్ వేస్తారు.
ఇది కూడా చదవండి..
పాడి పశువుల్లో పాలజ్వరం .. తీసుకోవాల్సిన నివారణ చర్యలు !
ఈ కార్యక్రమం ద్వారా పాడి రైతులను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి మరియు పాల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పద్దతి ద్వారా పూర్తియిన దూడలకు నిరోధక శక్తిని అధికంగా ఉంటుంది. భద్రాద్రి జిల్లాలో నాల్గో విడత కృత్రిమ గర్భధారణ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు మూడు విడతల్లో జిల్లా వ్యాప్తంగా 68,292 పశువులకు కృత్రిమ గర్భధారణ చేసారు. నాల్గో విడత 21,235 పశువులకు ఇంజక్షన్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి 16, 054 పశువులకు పూర్తి అయ్యింది. 6,822 లేగ దూడలు పుట్టాయి. కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
ఇది కూడా చదవండి..
Share your comments