దేశ వ్యాప్తంగా పాడి రైతులను కలవర పెడుతున్న వ్యాధి లంపీ స్కిన్ , పాడి పరిశ్రమను తీవ్రం గ ప్రభావితం చేసే ఈ వ్యాధి తొలుత రాజస్థాన్ రాష్ట్రము లో మొదలయి క్రమేపి అన్ని రాష్ట్రాలను కమ్మేసింది ,ఇప్పటి వరకు భద్రంగా వున్నా తెలంగాణ రాష్ట్రంలో పాడి రైతులను కలవరానికి గురిచేస్తుంది .
భైంసా మండలం టాక్లి గ్రామంలో రెండు పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకినట్లు భావిస్తున్నారు. ఓ ఆవు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం భైంసా డివిజన్ వ్యాప్తంగా 50 పశువులకు పైగా లంపి స్కిన్ వ్యాధి లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పశువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. పశువులకు వేగంగా వ్యాక్సిన్ ను వేస్తున్నారు. అంతేకాదు అధికారులు మహారాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి పశువుల రవాణాను నిలిపివేశారు. గ్రామాల్లో పశువుల వార సంతలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఈ వ్యాధిని అదుపు చేయడానికి పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి మెరుగుపడడం లేదు. మరోవైపు మెల్లగా ఈ వ్యాధి ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణాలో ఈ లంపీ స్కిన్ వ్యాధి వ్యాపించిందన్న కలకలం సృష్టిస్తున్నాయి. నిర్మిల్ జిల్లాలోని భైంసా డివిజన్ లో రెండు పశువుల్లో లంపి స్కిన్ వ్యాధి లక్షణాలు కనిపించాయి.
వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ వినియోగిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్న గుంటూరు రైతు!
అయితే ఏ వ్యాధి సోకిన పశువుల్లాలో మరణాల రేటు చాల తక్కువ అయినప్పటికీ సరైన చికిత్స అందించక పోతే మరణించే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ డా. యం .లక్ష్మణ్ , పాథాలజి హెడ్ , P. V నర్సింహా రావు వెటర్నరీ విశ్వ విద్యాలయం గారు తెలిపారు .
Share your comments