Animal Husbandry

వర్షాకాలంలో పశువులకు వచ్చే ప్ర‌ధాన వ్యాధులు.. నివారణ చర్యలు!

KJ Staff
KJ Staff
Buffaloes
Buffaloes

వర్షకాలంలో ముగ జీవాల సంరక్షణ చర్యలు సరిగ్గా తీసుకోకపోతే రైతులు వాటిని కోల్పోయి.. నష్టాల బారినపడే అవకాశం అధికంగా ఉంటుంది. ఒక్కోసారి ముగజీవాలకు వచ్చే సాధారణ వ్యాధులే అయిన్పటికీ..  సంరక్షణ చర్యలు సరిగ్గా తీసుకోకపోతే అవి మరణించే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో పశువులకు చాలా ర‌కాల  వ్యాధులు వ్యాపిస్తాయి. ఇదివరకు ఎండతో మరిగి ఉన్ననేల వర్షపు నీటితో  త‌డిసి చిత్తడిగా మారి.. మురుగు నీరుతో నేల‌ మారినప్పుడు ఈ రోగాలు ప్రబలుతాయి. అలాంటి ప్ర‌ధాన  రెండు రకాల వ్యాధులు.. నివారణ చర్యలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

గాలికుంటు వ్యాధి:

ప్రధానంగా గేదెలు, ఎద్దులు, ఆవులు, గిట్ట‌లు ఉన్న జీవులు గాలికుంటు వ్యాధి బారినపడతాయి. దీంతో పశువు శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది.  దాదాపు 104 నుంచి 105 డిగ్రీలకు ఉష్ణోగ్రత  పెరగడంతో పాటు వాటి నోట్లో, గిట్ట‌ల‌ మధ్య పుండ్లు ఏర్పడతాయి. దీంతో ఆహారం స‌రిగా తీసుకోకుండా అనారోగ్యానికి గుర‌వుతాయి. నిరసంగా మారి నడ‌వ‌డంలో తీవ్ర ఇబ్బందులు ప‌డ‌తాయి. పాడిపశువుల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. గాలికుంటు వ్యాధి నివారణ కోసం యాంటిబయోటిక్స్‌, పెయిన్‌కిల్లర్స్ ను వాడాల్సిఇ ఉంటుంది.  ఈ వ్యాధి సోకిన ముగ‌జీవాల‌కు  బిస్ప్రేపెన్‌ 2.5 గ్రాములు, ఎన్‌రోప్లాక్సిన్‌ 50 మిల్లీ లీట‌ర్లు,  సెఫ్‌ట్రిక్సిన్‌ 3 గ్రాములు, మెలోనెక్స్ 30 మిల్లీ లీట‌ర్లు,  నిమోవెట్ 50 మిల్లీ లీట‌ర్లు ప‌శువుల‌కు అందించాలి.

జలగవ్యాధి:

గేదెలు, దూడలు, గొర్రెలు, మేకలకు సాధార‌ణంగా వ‌చ్చే వ్యాధుల్లో జ‌లగ వ్యాధి కూడా ఒక‌టి. ఋ వ్యాధి మురుగునీరు కాల్వల్లో నీరు తాగ‌డం వ‌ల్ల వ‌స్తుంది. అలాగే, అలాంటి ప్రాంతాల్లో నీరు తాగిన జీవాల‌కు జ‌ల‌గ వ్యాధి వ‌స్తుంది. జలగవ్యాధి వల్ల పశువులు మేత త‌సుకోవ‌డంతో ఇబ్బందులు ప‌డ‌తాయి. పశువులకు దవడ కింద నీరు చేరుతుంది. అలాగే, పొట్టకింద నీరు చేరే అవ‌కాశం ఉంటుంది.  పాల దిగుబడి తగ్గుతుంది. జ‌ల‌గ వ్యాధి బారిన ప‌శువులు ప‌డ‌కుండా  100 మిల్లీ లీట‌ర్ల  నీయోజాడే ప్లస్‌,  డిస్టోడిన్‌ 4 మాత్రలు, డిస్టోనెక్స్‌బోలస్ ల‌ను అందించాలి.

వర్షాకాలంలో పశువుల్లో ఈ రెండు రకాల వ్యాధులు అధికంగా వస్తాయి. పశువులకు ఈ వ్యాధుల బారినపడకుండా ముందుగానే కొన్ని మందులను ప్రభుత్వం ఉచితంగానే అందిస్తోంది. కాబట్టి వాటిని స్థానికంగా ఉన్న పశువైద్య కేంద్రాలు, వ్యవసాయ కేంద్రాల వద్ద నుంచి తెచ్చుకుని రైతులు పశువులకు అందించాలి. దీంతో గాలి కుంటు, జలగ వ్యాధులతో పాటు ఇతర అనేక వ్యాధులు పశువుకు రాకుండా నివారించవచ్చు.

Related Topics

Farmers Cattles Monsoon Season

Share your comments

Subscribe Magazine