శాస్త్రవేత్తలు వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ (White spot syndrome virus) అని పిలువబడే ఆక్వాకల్చర్ వ్యాధికారకాన్ని సులభంగా గుర్తించే రోగనిర్ధారణ సాధనాన్ని అభివృద్ధి చేశారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (Department of Science and Technology)కి చెందిన అనుబంధ సంస్థ అయిన అఘార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (agharkar research institute) శాస్త్రవేత్తలు రొయ్యలలో వచ్చే వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్(White spot syndrome virus) ను గుర్తించే పెప్టైడ్(peptide) ఆధారిత రోగ నిర్ధారక టూల్ ని ఆవిష్కరించారు.31 మార్చి 2022న పేటెంట్ హక్కులను కూడా పొందింది.
అసలు ఏంటి ఈ వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ (White spot syndrome virus)
వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ ( WSSV ) అనేది విస్పోవైరస్ ( వైట్ స్పాట్ ) జాతికి చెందిన వైరస్. ఇది ముఖ్యంగా రొయ్యలలో సోకె వైరల్ ఇన్ఫెక్షన్ . ఈ వ్యాధి ప్రాణాంతకం మరియు అంటువ్యాధి, ఈ వ్యాధికి గురైన రొయ్యలు త్వరగా చనిపోతాయి.గతంలో ఈ వ్యాధి వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నపెద్ద మొత్తంలో రొయ్యల సంఖ్య కొన్ని రోజుల్లోనే తుడిచిపెట్టుకుపోయింది.
ఈ వైరస్ భారత్ లో 1994వ సంవత్సరంలో వ్యాప్తి చెందింది.మొదటగా ఇది 1992లో తైవాన్ లో గుర్తించబడింది.తర్వాత జపాన్ ,కొరియా థాయ్‌లాండ్, ఇండియా మరియు మలేషియా వంటి దేశాలకు వ్యాప్తి చెందింది.
అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన ఈ రోగ నిర్ధారక సాధనంతో ఈ వైరస్ ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు తద్వారా రొయ్యల పెంపకంలో అధిక దిగుబడులను సాదించవచ్చు. భారత్ నుండి రొయ్యలు అత్యధికంగా అమెరికా వంటి దేశాలకి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.
మరిన్ని చదవండి.
Share your comments