ఆంధ్ర ప్రదేశ్ లోని కోస్త జిల్లాలు, రొయ్యలు, చేపల పెంపకానికి పెట్టింది పేరు. ఇక్కడ కొన్ని వేల ఎకరాల్లో ఆక్వా సాగు రైతులు చేపడుతున్నారు. అన్ని యాజమాన్య పద్దతులు సరైన విధంగా పాటిస్తే అధిక లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి, రైతులు వీటిని సాగు చెయ్యడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ త్రోవలోనే ఈ మధ్య కాలంలో పీతల పెంపకం కూడా పెరుగుతూ వస్తుంది. అయితే పీతలను నేరుగా చెరువులో కాకుండా నీటిపై తేలియాడే బాక్సుల్లో పెంచుతూ రైతులు అధిక లాభాలను పొందుతున్నారు. ఈ పద్దతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పడు పీతలను పెంచడం చాలా కష్టతరంగా ఉండేది. ఎందుకంటే పీటలు స్వజాతి భక్షకులు, చెరువులో పీతల పెంపకం చెప్పటినప్పుడు, బలమైన పీటలు బలహీనమైనవాటిని తినేస్తాయి. దీనివలన ఆశించిన రీతిలో దిగుబడి పొందడం సాధ్యపడదు. దీనికి ప్రత్యామ్న్యాయంగా బాక్సుల పద్దతిలో పీతలను పెంచడం ద్వారా, ఈ సమస్యను నియంత్రించి అధిక దిగుబడులు పొందుతున్నారు. దీని వలన పీతల సాగుకి మంచి రోజులు వచ్చాయనే చెప్పవచ్చు.
బాక్సుల్లో పీతలను పెంపకం చేపడితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, మొదటిగా వీటి ఎదుగుదలను ప్రతిరోజు గమనిస్తూ, వాటికి అవసరమైన ఆహారని సులభంగా అదించవచ్చు. పీతల సాగు నుండి మంచి దదిగుబడి వస్తుండడంతో ఎంతో మంది రొయ్యల రైతులు వీటిని సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రొయ్యల సాగు తెగుళ్లు సోకే ఎక్కువ నష్టం రావడానికి అవకాశం ఉంటుంది. పైగా వాతావరణం సహకరించక చాలా మంది రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం కష్టమవుతుంది. పితలకు రోగం సోకే అవకాశం చాలా తక్కువ.
రొయ్యల లాగానే పీతలను కూడా ఎంపిక చేసిన చెరువుల్లో సాగు చెయ్యవలసి ఉంటుంది. పీతల సాగు మొదలుపెట్టే ముందు మంచి రకాలను ఎంచుకోవడం తప్పనిసరి. సాధారణంగా పితల్లో రెండురకాలుంటాయి. ఒక రకం పద్దతిలో ల్యాబుల నుండి పీతలు గుడ్లను సేకరించి వాటిని పెంచుతారు. హేచరీల నుండి 100 గ్రాముల సైజు ఉన్న పిల్లలను కొనుగోలు చేసి వాటిని పెంచుతారు, దీనికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. అదేవిధంగా గుల్ల విడిచిన పీతలను సేకరించి, వాటి షెల్ గట్టిపడేవరకు పెంచడం రెండవ పద్దతి. ఈ పద్దతిలో రెండు-మూడు నెలలపాటు షెల్ గట్టిపడేవరకు పెంచి తర్వాత మార్కెట్లో విక్రయించవచ్చు.
బాక్సుల్లో పీతలను పెంచడానికి, పీవీసీ పైపుల సహాయంతో ప్రత్యేక నిర్మాణం చేపట్టాలి, ఈ పైపులకు బాక్సులను అమర్చి వాటిలో పీతలను పెంచుతారు. ఈ బాక్సులు నీటిలో తెలివుండడం వలన పీతలు వాటిలో తిరుగుతూ వేసిన ఆహారం తింటాయి. మన దేశంలో పెంచిన పీతలకు దేశీయ మార్కెట్లతోపాటు, విదేశీ మార్కెట్లోకూడా మంచి డిమాండ్ అధికంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్లోని తీరప్రాంతాలు పీతల సాగుకి అనుకూలం. ఈ నూతన పద్దతి ద్వారా బాక్సుల కోసం ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలాకాలం వరకు చాలాకాలం వరకు మంచి దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది.
Share your comments