Animal Husbandry

శ్రీశైలం అడవుల్లో అరుదైన అలుగులు..

Gokavarapu siva
Gokavarapu siva

శ్రీశైలం అడవుల్లో అరుదైన అలుగులను( ఇండియన్ పాంగోలిన్) గుర్తించారు. ప్రస్తుతం ఈ అలుగులు అంతరించే దశకు వచ్చాయి. ఈ అలుగులను వివిధ రకాల పేరులైన వాలుగు, చిప్పల పంది అని కూడా పిలుస్తారు. ఈ అలుగులనేవి ఆహారంగా చీమలు, చెద పురుగులను తింటాయి. వీటికి ఒళ్ళంతా పొలుసులనేవి ఉంటాయి. శ్రీశైలం అడవుల్లో పులుల సంచారం తెలుసుకునేందుకు అమర్చిన కెమెరా ట్రాప్లో వీటిని గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 8 జాతుల పాంగోలిన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ 8 జాతుల్లో 4 జాతులు ఆఫ్రికా ఖండంలో మరియు మిగిలిన 4 జాతులు ఆసియా ఖండంలో ఉన్నాయి. ఈ నాలుగు జాతుల్లో 2 జాతులు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. అందులో అరుదైన ఇండియన్ పాంగోలిన్ మన రాష్ట్రంలో గుర్తించారు. ఈ ఇండియన్ పాంగోలిన్ అనేది వాటిపైకి ఎవరైనా దాడి చేయడనికి వస్తే, ఇవి ప్రాణాపాయం భయంతో బంతిలా ముడుచుకుపోతాయి.

ఈ అలుగుల సంఖ్య అనేది మిగిలిన జంతువులతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటిని రక్షించడానికి తగిన చర్యలు రాష్ట్రము తీసుకోవాలి. ఈ పాంగోలిన్ ను కాపాడే దిశగా వాటి యొక్క ఉనికి మరియు ఆవాసాలు గురించి మరియు వాటి రక్షణ కొరకు వైల్డ్ లైఫ్ సొసైటీ, రాష్ట్ర అటవీ శాఖ కలిసి పరిశోధనలను చేపట్టాయి. ఈ పరిశోధనల్లో భాగంగా పాంగోలిన్ లు యొక్క ఆవాసాలు ఎలా ఉన్నాయి, వాటికీ ఎలాంటి ప్రాంతాలు అంటే నివసించడానికి ఇష్టపడతాయి, ఆహారంగా వేటిని తింటాయి అనే వాటిని తెలుసుకుంటారు.

ఇది కూడా చదవండి..

విశాఖ సముద్రంలో విస్తరిస్తున్న 'కేజ్ కల్చర్'

ఈ ఇండియన్ పాంగోలిన్ అనేది ఒక అరుదైన జాతి. ఇవి అంతరించిపోయే స్థితికి రావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. వీటిపై ఉండే పొలుసులను వైద్యశాస్త్రంలో వాడతారు. వీటికి అంతర్జాతీయంగా బాగా డిమాండ్ కూడా ఉంది. కాబట్టి వేటగాళ్లు ఇష్టం వచ్చినట్లు ఈ అలుగులను వేటాడడంతో వీటి సంఖ్యా భారీగా తగ్గిపోయింది. ఇలా వేటాడిన ఈ అలుగులను అక్రమంగా విదేశాలకు రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ పాంగోలిన్ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుంది. దీని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..

విశాఖ సముద్రంలో విస్తరిస్తున్న 'కేజ్ కల్చర్'

Share your comments

Subscribe Magazine