భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు అయితే ప్రస్తుతము ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేక పాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి , 2022 సంవత్సరంలో భారతదేశం 221 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తితో ప్రపంచం లోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దారుగా ఉన్న 2023 మొదటి త్రైమాసికానికి ఉత్పత్తి భారీగా పడిపోయింది దీనితో పాల ఉత్పత్తుల ధరల ద్రవ్యోల్బణం 9.31 శాతంగా ఉంది.
2023 సంవత్సరం మెుదటి త్రైమాసికంలో ఇది 9.25 శాతంగా ఉంది. 2014 అక్టోబర్-డిసెంబర్ తర్వాత పాల ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉండటం ఇదే తొలిసారి. సీపీఐ ద్రవ్యోల్బణం బాస్కెట్లో పాలు, పాల ఉత్పత్తులకు 6.62 శాతం వాటా కలిగి ఉంది.
రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో రైతుల సగటు ఉత్పత్తి వ్యయం కూడా పెరిగింది మరోవైపు మేత ఖర్చులు భారీగా పెరగడంతో రైతులు పశువుల సంఖ్యను సగానికి తగ్గించుకున్నారు దీనితో పెరిగిన మేత ఖర్చు పరోక్షంగా పాల ఉత్పత్తి పై పడింది దీనితో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది ,మరోవైపు లాంఫీ చర్మ వ్యాధి సోకి దేశంలో చాల వరకు పశువులు మరణించాయి ఇదికూడా పాల ఉత్పత్తితగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు .
రైతులపై అధన చార్జిల భారం..హమాలీ చార్జిలు ఎంతంటే?
పాల దిగుమతి పై కేంద్ర మంత్రి ఏమన్నారు :
పాల ఉత్పత్తి తగ్గినా మనం ఇతర దేశాలనుంచి పాలు మరియు పాలకు సంబందించిన ఉత్పత్తులను దిగుమతి చేసుకోబోమని దేశంలోనే పాలకు సంబందించిన ఉప ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తామని కేంద్ర జంతు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు .
Share your comments