Animal Husbandry

సహివాల్ ఆవు:తీయటి పాలు,అధిక వెన్న ఇచ్చే పాడి ఆవు!

S Vinay
S Vinay

సహివాల్ ఆవు భారతదేశపు ఉత్తమ పాడి జాతులలో ఒకటి. ఈ ఆవు అధిక పాల ఉత్పత్తిని ఇస్తుంది. ఈ ఆవు యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం.

సహివాల్ భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్ ప్రాంతంలో పుట్టింది. వాటిని ఒకప్పుడు "జంగ్లీస్" అని పిలిచేవారు.ఇతర స్థానిక జాతులతోపోలిస్తే ఈ జాతి మంచి పాల ఉత్పత్తిని ఇస్తుంది మరియుఇది రోజుకు సగటున 8-10 లీటర్ల పాలను ఇస్తుంది.వీటి పాలలో సుమారుగా ఇం దులో 5 నుండి 6 శాతం వరకు కొవ్వు పదార్థాలు ఉం టాయి. వీటికి గల పెద్ద పెద్ద చనుమొనల కారణంగా పాలు పితకడం
సులభతరం.

ఈ ఆవు యొక్క ముఖ్య లక్షణాలు:
సహివాల్ ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. మెడపై తెలుపు రంగుని కలిగి ఉంది.

ఈ జాతి చెవులు వంగిపోయి ఉంటాయి.మూపురం చాలా పెద్దది.

ఈ జాతి ఆవులు చాలా ఎత్తుగా మరియు పొడవుగా ఉం టాయి.

బొడ్డు చుట్టూ ఉన్న చర్మం మందంగా ఉంటుంది.

కొమ్ములు చిన్న పరిమాణం లో దృడంగా ఉంటాయి.

పొదుగు పెద్ద పరిమాణం లో మరియువేలాడుతూ ఉం టుం ది.

సహివాల్ ఆవు తోక చాలా పొడవుగా ఉంటుంది.

వయోజన ఎద్దు బరువు 400-500 కిలోలు మరియుఆవు శ్రే ణులకు 700-800 కిలోలు.

మొదటి సారి దూడను ఈనడానికి సుమారు 3-3.5 సం వత్సరాలు పడుతుంది.

దూడ పుట్టినట్టి ప్పు డు 22-28 కిలోల బరువు ఉంటుంది.

సాహివాల్ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా పెరుగుతుంది.

దీనిని "లంబి బార్", "లోలా", "మోంట్‌గోమేరీ", "ముల్తానీ" మరియు "టెలి" అని కూడా పిలుస్తారు. డైరీ ప్రయోజనం కోసం ఈ సహీవాల్ ఆవులు చాలా ఉత్తమం.

మరిన్ని చదవండి.

రైతుల ఇంటి వద్దకే పశు వైద్య సేవలు!

Share your comments

Subscribe Magazine