చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకాన్ని చేపట్టి మిశ్రమ వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నారు.గొర్రెలు సున్నితమైన నెమరువేసే జంతువులు వీటికి సీజనల్ గా కొన్ని ప్రమాదకర వ్యాధులు వస్తుంటాయి.నిర్లక్ష్యం వహిస్తే అధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి సీజనల్ వ్యాధుల ముప్పును తగ్గించుకోవడానికి మందలోని అన్ని గొర్రెలకు సకాలంలో టీకా చెప్పినట్లయితే సీజనల్ గా వచ్చే వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.
గొర్రె పిల్లలకు మూడు నెలల వయస్సు దాటిన తరువాత మొదటిసారి నట్టల మందు త్రాపాలి. నట్టల మందు త్రాపేటప్పడు ఊపిరితిత్తుల్లోకి మందు పోకుండా జాగ్రత్తగా తాపాలి. నట్టల మందు త్రాపిన 10-15 రోజుల వ్యవధిలో చిటుక వ్యాధి టీకా మందు ఇవ్వవలసి ఉంటుంది. తరువాత 15 రోజులకు రెండవ డోసు టీకా రోజుల వ్యవధిలో. చిటుక వ్యాధి టీకా ఇచ్చిన 15-30 రోజుల తర్వాత బొబ్బ రోగానికి టీకా మందు ఇవ్వవలసి ఉంటుంది. సంవత్సరం పొడవునా గొర్రెల వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవ్వవలసిన టీకాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక దిగుబడినిచ్చే 10 ఉత్తమ వరి రకాలు !
జనవరి నెలలో మూడు నెలల వయసున్న గొర్రెలకు పి.పి.ఆర్. టీకా,గొంతువాపు టీకాలు, నట్టల నివారణ మందు త్రాగించాలి. ఫిబ్రవరి నెలలో బొబ్బ వ్యాధి టీకా, నోటి ద్వారా లివర్ టానిక్స్ మరియు బి-కాంప్లెక్స్ మందులు త్రాగించాలి. మార్చి నెలలో గొర్రెలలో సాధారణంగా వచ్చే పిడుదులు, గోమార్ల నిర్మూలన చర్యలు చేపట్టినట్లు అయితే గొర్రెలు ఆరోగ్యంగా ఎదగ గలవు. ఏప్రిల్ నెలలో అంతర పరాన్నజీవుల నివారణ చర్యలు చేపట్టాలి. మే నెలలో చిటుక వ్యాధి టీకా, లివర్ టానిక్స్ బి-కాంప్లెక్స్ జూలైలో నట్టల నివారణ మందులు,గొంతు వాపు టీకాలు తప్పని సరిగా వేయించాలి. అక్టోబర్లో నట్టల నివారణ, గొర్రె వునూచి మరియు చిటుకు రోగం టీకాలు వేయించాలి.
Share your comments