సాధారణంగా చేపలు రైతులకు ఎన్నో లాభాలను తెచ్చి పెడతాయి. కానీ ఈ చేప మాత్రం ఆక్వా రైతులను తీవ్రమైన నష్టాల్లోకి కూరుకు పోయేలా చేస్తోంది. చూడటానికి చేప మాదిరిగానే వింత ఆకారాన్ని పోలి ఉండే ఈ చేప తినడానికి పనికిరాదు. ఇంత వింత ఆకారం కలిగిన ఈ చేపను సక్కర్ మౌత్ ఫిష్ గా పిలుస్తారు. ఈ వింత చేపను ఎండపల్లి గ్రామంలో కూలీలు కనుగొన్నారు. ఆ గ్రామంలోని చిన్న కల్వర్టులో ఈ విధమైన చేపలను గమనించిన కూలీలు ఎంతో ఆశ్చర్యపోయారు.
ఈ విధంగా కూలీల కంటిలో పడిన ఈ సక్కర్ మౌత్ ఫిష్ గురించి కొత్తపల్లి మండలం మత్స్య శాఖ అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఇంతటి విచిత్రమైన సక్కర్ మౌత్ ఫిష్ మన దేశానికి చెందినది కాదని ఇలాంటి చేపలు చేప పిల్లల విత్తనాలను బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకునే క్రమంలో వాటితో పాటు కలిసి వచ్చి ఉంటాయని ఉమామహేశ్వరరావు తెలియజేశారు.
ఈ సర్కార్ మౌత్ ఫిష్ లు పశ్చిమ గోదావరి జిల్లలో ఆక్వా చెరువులలో రొయ్యలు పండించే రైతుల పాలిట రాక్షసులుగా మారి పోయాయి. ఆక్వా రైతులు చెరువులలో రొయ్యల కోసం వేసే మేతను ఇవి విపరీతంగా తింటాయి. అలాగే వలను కొరికి వేయడంతో ఆక్వా రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ విధమైన సక్కర్ మౌత్ ఫిష్ లు కాలువల వెంట ఒక చోట నుంచి మరొక చోటకు ఎంతో తొందరగా ప్రయాణం చేస్తాయని అధికారులు తెలియజేశారు.ప్రస్తుతం ఈ విధమైనటువంటి చేపలు ఉండటం వల్ల ఆక్వా రైతులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మత్స్య శాఖ అధికారులు రైతులకు సూచించారు.
Share your comments