మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చాలా మంది రైతులు వ్యవసాయం ఒకటే లాభసాటి కాదని గ్రహించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైన బాయిలర్ కోళ్ల పెంపకం చేపట్టి అధిక లాభాలను పొందుతున్నారు. బాయిలర్ కోళ్ళ ద్వారా వచ్చే మాంసం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో కొనసాగుతోంది. బాయిలర్ కోళ్ల పెంపకం కొంత శ్రమ, అధిక రిస్కుఅయినప్పటికీ సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో నాణ్యమైన ఆరోగ్యవంతమైన కోడి పిల్లలను ఎంపిక చేసుకుని కోళ్ల షెడ్డు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే సూక్ష్మజీవుల వలన కోళ్లు త్వరగా వ్యాధిగ్రస్తం చెందే అవకాశం ఉంది. అలాగే సీజనల్గా వచ్చే అన్ని వ్యాధులను ఎదుర్కోవడానికి ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళలో అధికంగా వచ్చి నష్టపరిచే రక్తపారుడు, గంబోర, కొక్కెర తెగులు సోకకుండా టీకలు వేయించాలి మరియు శ్వాసకోశ వ్యాధులు రాకుండా యాంటిబయోటిక్ దాణాలో లేదా నీటిలో కలిపి వ్యాధి నివారణ చర్యలు చేపట్టడం.
శీతాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: సాధారణంగా శీతాకాలంలో వాతావరణం అధిక తేమ కలిగి ఉంటుంది. తద్వారా లిట్టర్ త్వరగా తడిగా అవుతుంది.లిట్జర్ను పొడిగా ఉండేటట్లు తరుచుగా కొత్త లిట్టర్ మరియు పొడి సున్నం తరుచూ చల్లుకోవాలి. మరియు నీళ్ళ తొట్టెలు నీరు ఒలకడం వల్ల లిట్టర్ తడిగా ఉండే అవకాశం ఉన్నందున రోజువారిగా డ్రింకర్లను వేరు వేరు ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. అలాగే విష వాయువులు బయటకు వెళ్ళుటకు, స్వచ్ఛమైన గాలి. లోపలికి వచ్చుటకు తగిన మోతాదులో గాలి ప్రసరణ ఉండేటట్లు చూసుకొనవలెను.
వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: సహజంగా కోళ్లు అధికవేడిని భరించలేవు కావున షెడ్డు పైకప్పుకు సున్నం లేదా గడ్డి పరిచి సూర్యరశ్మి తీవ్రతను తగ్గించవచ్చు.కోళ్ళ షెద్దుకు ఇరువైపులా చెట్లను పెంచి,ప్రక్క గోడల వెంబడి గోనే సంచులను ఏర్పాటు చేసుకొని, ప్రతి గంటకు ఒకసారి నీళ్ళను చల్లుతూ ఉండాలి. వేసవి తీవ్రత తట్టుకోడానికి కోళ్లకు శుభ్రమైన, చల్లని నీటిలో ఎలక్ట్రోలైట్స్ కలిపిఅందించాలి. వేసవి శీతాకాలంలో తగు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే కోళ్ల మరణాల రేటు తగ్గి అధిక లాభాలను పొందవచ్చు.
Share your comments