Animal Husbandry

" ఉచితంగ చేప పిల్లల పంపిణి .. మధ్య దళారులను నమ్మి మోసపోవద్దు "-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Srikanth B
Srikanth B
free distribution of fish fingerlings
free distribution of fish fingerlings

 

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పల్లెగుట్ట వద్ద ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి జనగామ జిల్లా లోని స్టేషన్ ఘన్ పూర్ లో ప్రారంభించడం జరిగిందని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకున్న వేళా చేపలపెంపకానికి సరైన సమయం గ భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తం అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపటనున్నట్లు తెలంగాణ పశు సంవర్ధకం మరియు మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు .చేప పిల్లల కౌంటింగ్, నాణ్యత కూడా గమనించి జాగ్రత్తగా చేసుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ కోరిక మేరకు మన ఊరు మన బడిలో భాగంగా విద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు.

అదేవిధం గ రాష్ట్ర వ్యాప్తం గ మొత్తం 26778 చెరువులలో 68 కోట్ల చేప పిల్లలను మరియు 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయన్నునారు , దీనిలో భాగంగ చేపపిల్ల పంపిణి కోసం రూ . 88. కోట్లు మరియు రొయ్యపిల్ల పంపిణి కోసం రూ .24. 50 కోట్లు ప్రభుత్వం నిధులను కేటాయించనుట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు . దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగ చేపల పంపిణీకి రూ . 133. 03 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

PKVY:పరంపరగత్ కృషి వికాస్ యోజన : ఇ పథకం క్రింద సేంద్రియ వ్యవసాయానికి రూ. 50000/- ప్రోత్సాహకం..

ఉచితంగ చేపల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ నెలలో 5 న ప్రారంభం కానున్నట్లు దానికి సంబందించిన అన్ని ఏర్పాట్లను సంబందించిన శాఖ అధికారులు చేపట్టవల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులన్ని జలకళ సంతరించుకున్న వేళ్ళ రైతులకు చేప పిల్ల పంపిణి ఉచితం గ చేయడానికి ఇదే సరైన సమయం గ భావితున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఈనెల సెప్టెంబర్ 5 నుంచి ఉచితంగ చేప పిల్లల పంపిణి కార్యక్రమం ప్రారంభించనున్న క్రమంగా లో సంబంధిత అధికారులతో విడియోకాన్ఫిరెన్స్ నిర్వహించిన మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు ఈమేరకు సూచనలు జారీ చేసారు. అదేవిధంగా ఈ చేప పిల్లల పంపిణి పారదర్శకంగా జరిగేలా చూడడం కోసం ప్రభుత్వం రూపొందించిన "మత్య మిత్ర " మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు .

PKVY:పరంపరగత్ కృషి వికాస్ యోజన : ఇ పథకం క్రింద సేంద్రియ వ్యవసాయానికి రూ. 50000/- ప్రోత్సాహకం..

Share your comments

Subscribe Magazine