Animal Husbandry

పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

KJ Staff
KJ Staff

పాడి రైతులకు తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనియాస్ యాదవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలో పాడి రైతులకు పాడి గేదెలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా మసబ్‌ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో విజయ డెయిరీ ఛైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన జరిగిన విజయ డెయిరీ బోర్డు సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

త్వరలో విజయ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలకు పాలు పోసే పాడి రైతులకు పాడి గేదెలను సబ్సిడీపై అందిస్తామని తెలిపారు. పాడిగేదెల కోసం ఇప్పటికే చాలామంది రైతులు డీడీలు చెల్లించారని, వారికి త్వరలో అందిస్తామన్నారు.  ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.

సబ్సిడీపై  పాడిగేదెల పంపిణీ నిర్వహణకు విజయ డెయిరీ సంస్థ నోడల్ ఏజెన్సీగా ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇక  నుంచి సబ్సిడీపై అందించే  పాడిగేదెలకు ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని, పాడిగేదెలు అనివార్య కారణాలతో చనిపోయినా.. ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేయగా వచ్చిన డబ్బులతో కొత్త గేదెలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇస్తామన్నారు.

అటు పాడి రైతులకు త్వరలో  లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు తలసాని తెలిపారు. ఇక నుంచి లీటర్ పాలపై పాడి రైతులకు ప్రభుత్వం రూ.3 ఇన్సెంటివ్, డెయిరీ సంస్థలు రూ.1 చెల్లిస్తాయన్నారు. ఇప్పటికే ప్రోత్సాహకానికి సంబంధించిన నిధులను విడుదల చేశామన్నారు. తెలంగాణలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తలసాని తెలిపారు.

Share your comments

Subscribe Magazine