Animal Husbandry

స్కోచ్ అవార్డులను దక్కించుకున్న పశుసంవర్ధక శాఖ...

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ 2023-24 సంవత్సరానికి సంబందించి రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు స్కోచ్ అవార్డులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా రూ.240 కోట్లను ఖర్చు పెట్టి 340 సంచార పశు ఆరోగ్యసేవా రథాలను నియోజకవర్గానికి రెండు చెప్పున రాష్ట్రంలో అందుబాటు లోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలకు సిల్వర్ స్కోచ్ అవార్డు దక్కింది. దీనితోపాటు పశువుల వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్, వెటర్నరీ టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ మరియు ఆంధ్ర గోపుష్టి కేంద్రానికి ఈ స్కోచ్ మెరిట్
అవార్డులు దక్కాయి.

దేశంలోనే మొట్టమొదటి సారిగా టెలిమెడిసిన్ కాల్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి మొత్తానికి ఏడు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టారు. ఈ కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు 1.46 లక్షల ఫోన్ కాల్స్ను అటెండ్ చేసి వారి సమస్యలను పరిష్కరించారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 2.25 లక్షల పశువులకు వైద్యసేవలు అందించి, సుమారుగా 2.02 లక్షల రైతులకు ప్రభత్వం లబ్ది చేకూర్చింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తానికి 154 వైఎస్సార్ వెటర్నరీ ల్యాబ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్స్ ద్వారా ఇప్పటివరకు 309 లక్షల శాంపిల్స్ కు పరీక్షలు చేసి వాటికి అవసరమైన వైద్యసేవలు అందించారు. రైతులు ఈ కాల్ సెంటర్లకు కాల్ చేసి, వైద్యాధికారులు మరియు శాస్త్రవేత్తల ద్వారా వారి సమస్యలకు పరిష్కారాలను పొందవచ్చు.

ఇది కూడా చదవండి..

ఖరీఫ్ వరి నికర ఆదాయంలో ఏపీ 4వ స్థానం..

ప్రభుత్వం రాష్ట్రంలో 58 వైఎస్సార్ దేశవాళీ గో జాతుల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. 120 దేశి ఆవులను, ఒక ఆంబోతు చెప్పున ఒక్కో కేంద్రానికి అందించారు. ఈ ఆవుల నుండి వచ్చే పాల ద్వారా ఉత్పత్తులను తయారుచేసి ఆంధ్ర గోపుష్ఠి పేరుమీద విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటువంటి వినూత్న కార్యక్రమాల వలన సిల్వర్, మెరిట్ సర్టిఫికెట్లకు ఎంపిక అవ్వింది.

గతంలో కూడా రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు ఎన్నో అవార్డులు దక్కాయి. 2021 22లో పశుసంరక్షక్ ఆప్ కు స్కోచ్ సిల్వర్ అవార్డు లభించింది. యానిమల్ లీడర్షిప్ అవార్డు - 2022, 2020లో అవార్డు ఆఫ్ ఎక్స్టెన్స్ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి లభించింది.

ఇది కూడా చదవండి..

ఖరీఫ్ వరి నికర ఆదాయంలో ఏపీ 4వ స్థానం..

Share your comments

Subscribe Magazine