వలస పక్షులు, వలస పక్షుల ఆవాసాల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు అమలు చేయాలని సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే ప్రాంత దేశాలు నిర్ణయించాయి. సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే (సీఏఎఫ్)లో వలస పక్షులు, వాటి ఆవాసాల కోసం పరిరక్షణ అమలు చేయాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం/ వలస జాతులపై కన్వెన్షన్ (యూఎన్ఈపీ/సీఎంఎస్) సహకారంతో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం న్యూఢిల్లీలో 2023 మే 2 నుంచి 4 వరకు జరిగింది.
సమావేశాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ప్రారంభించారు. తన ప్రసంగంలో గ్లాస్గో లో జరిగిన కాప్ -26లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని మంత్రి ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన లైఫ్ (పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణం కోసం జీవనశైలి) విధానాన్ని మంత్రి వివరించారు.
ప్రపంచ ట్యూనా దినోత్సవం 2023: ట్యూనా అంటే ఏమిటి మరియు వీటి ప్రాముఖ్యత తెలుసుకోండి..
ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే (సీఏఎఫ్)లో వలస పక్షులు, వాటి ఆవాసాల కోసం పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు భరతదేశం చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. పర్యావరణహిత జీవనశైలి అవలంభించడం వల్ల వలస పక్షుల తో సహా అన్ని జీవుల ఉనికిని రక్షించడానికి అవకాశం కలుగుతుందన్నారు. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని వలస పక్షుల తో సహా అన్ని జీవుల ఉనికిని పరిరక్షించడానికి తగిన చర్యలు అవసరమనిశ్రీ అశ్విని కుమార్ చౌబే స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీ అశ్విని కుమార్ చౌబే అన్నారు. పర్యావరణహిత జీవన శైలి కోసం ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన సమావేశం సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో పరిరక్షణ,సుస్థిర అభివృద్ధి అనే ఉమ్మడి లక్ష్యం సాధనకు ఉపకరిస్తుందన్నారు.
Share your comments