Animal Husbandry

పడిపోయిన బ్రాయిలర్ కోళ్ల ధరలు.. నష్టాల్లో పౌల్ట్రీ రైతులు..

Gokavarapu siva
Gokavarapu siva

కోళ్ల పెంపకం అనేది రైతులకు నిరాశనే మిగిలిస్తుంది. గతంలో బ్రాయిలర్ కోళ్లు, మరియు గుడ్లకు ధర బాగానే పలికింది. కానీ ఇప్పుడు ట్రేడర్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఈ పౌల్ట్రీ రైతులు చిక్కి నష్టాల పాలవుతున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి ధరలకు కూడా గిట్టుబాటు కాకపోవడంతో చివరకి ఈ పౌల్ట్రీ రైతులకు కష్టాలే మిగులుతున్నాయి. దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే సబీసీడీలను కూడా అందించకపోవడంతో పెట్టుబడి ఖర్చు మరింత పెరిగిపోయిందని రైతులు ఆందోళన చేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్ లో ఒక కిలో బ్రాయిలర్ కోడి కొనుగోలు ధర రూ.80 ఉండగా, రైతులకు బ్రాయిలర్ కోడి ఒక కిలో బరువు పెంచేందుకు రూ.85 నుండి రూ.90 వరకు ఖర్చు అవుతుంది. పైగా దీనిలో తరుగు తీస్తే రైతులకు మిగిలేది కేవలం రూ.70 నుండి రూ.72 మాత్రమే. దీనితో రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా రాకపోగా నష్టాలు మిగులుతున్నాయి.

ఇది ఇలా ఉండగా మార్కెట్ లో ఒక గుడ్డు యొక్క ధర వచ్చేసి రూ.3.75 నుండి రూ.3.80 వరకు ఉంటుంది, కానీ రైతులకు ఒక గుడ్డుని ఉత్పత్తి చేయడానికి రూ.4.50 నుండి రూ.4.75 ఖర్చు అవుతుంది. గతంతో పోల్చుకుంటే సుమారుగా రూ.2 తగ్గిపోయింది. ఈవిధంగా రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో నష్టాల పాలు అవుతున్నారు.

ఇది కూడా చదవండి..

రాష్ట్రంలో పాడి సంపద అభివృద్ధి కొరకు కొత్త ప్రణాళికలు

కోళ్లకు ఆహరం కింద వివిధ రకాల దాణాలు వాడుతూ ఉంటారు. మార్కెట్ లో ఆ దాణాల ఖర్చు కూడా బాగా పెరిగిపోయింది. ఉదాహరణకు కోళ్లకు ఆహరం కింద సోయాబీన్ దాణాను వేస్తారు. ప్రస్తుతం మార్కెట్ లో ఈ సోయాబీన్ ధన ధర వచ్చేసి టన్ను రూ.52 వేలు వుంది. దానితో పాటు కోడి పిల్లల ధరలు మరియు వాటి యొక్క నిర్వహణ ఖర్చు కూడా బాగా పెరిగిపోయింది. కోళ్లను పెంచడానికి కూలీలా చార్జీలు, ఫార్మ్ యొక్క నిర్వహణ ఖర్చు, కరెంట్ బిల్లు చార్జీలు, కోడి పిల్లలకు మెడిసిన్ ఇవన్నీ కలుపుతుంటే రైతులకు పెట్టుబడి బాగా పెరిగిపోతుంది.

వీటితో పాటు ఫామ్ గేట్ వద్ద బ్రాయిలర్ కోడి ధరలు బాగా తగ్గిపోయాయి. ఈ ధరలను కార్పొరేట్ సంస్థలు మరియు ట్రేడర్లే నిర్ణయిస్తున్నారు. గతంలో ఇక్కడ కిలో కోడి రూ.120 నుండి రూ.130 వరకు ఉండేది, కానీ ప్రస్తుతం రూ.50 నుండి రూ.60 కు పడిపోయింది. దీనితో పాటు ప్రభుత్వం అందించే సబీసీడీలు కూడా ఇవ్వకపోవడంతో రైతులపై అధిక భారం పడుతుంది. దీనితో పెట్టుబడి ఖర్చు కూడా పౌల్ట్రీ రైతులకు రాకపోవడంతో నష్టాల పాలవుతున్నారు.

ఇది కూడా చదవండి..

రాష్ట్రంలో పాడి సంపద అభివృద్ధి కొరకు కొత్త ప్రణాళికలు

Related Topics

Poultry Farming price fall

Share your comments

Subscribe Magazine