మనకు అధిక పాలను ఇచ్చే మేలిమి జాతి పశువుల్లో ఈ ముర్రా జాతి గేదెలు కూడా ఒకటి. సాధారణంగా ఒక ముర్రా గేదె బిడ్డకు జన్మనివ్వడానికి నాలుగున్నర సంవత్సరాలు పడుతుంది. కానీ కొత్తగా చేసిన పరిశోధనలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ గేదెలు అతి తక్కువ సమయంలోనే గర్భధారణ చెందే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఈ ముర్రా గేదెకు కేవలం 3 సంవత్సరాల 3 నెలల సమయం పడుతుంది.
హర్యానాకు చెందిన హిసార్‌లోని సెంట్రల్ బఫెలో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సుమారుగా 100 గేదెలపై కొత్తగా ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఎం వెల్లడించారు అంటే, పశువులకు కేవలం మంచి పోషకాలు కలిగిన ఆహరం మరియు వాటిని సరిగ్గా చూసుకోవడం ద్వారా గర్భధారణ సమయం తగ్గించడం సాధ్యం అన్నారు.
ఈ ప్రయోగంలో సెంట్రల్ బఫెలో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విజయం సాధించింది. సుమారుగా 100 ముర్రా జాతి గేదెలపై చేసిన ఈ ప్రయోగంలో ఆ పాడి పశువుల్లో గర్భధారణ సమయాన్ని నాలుగున్నర సంవత్సరాలకు బదులుగా మూడు సంవత్సరాల, మూడు నెలలకు తగ్గించారు. ప్రస్తుతం ఈ ముర్రా జాతి గేదెలు 9-10 సార్లు మాత్రమే సంతానోత్పత్తి చేస్తున్నాయి, కానీ ఈ ప్రయోగం ద్వారా మొదటి దూడ పుట్టే సమయం తగ్గడంతో వాటి జీవిత కాలంలో 10-12 సార్లు సంతానోత్పత్తి చేయగలదు.
ఇది కూడా చదవండి..
ఈ జాతుల మేకల పెంపకంతో లక్షల లాభాలు..
గేదెల్లో సంతానోత్పత్తి ఆలస్యం కావడం వలన పాడిరైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారు. రైతులను ఆర్ధికంగా బలపరచడానికి మరియు ఈ సమస్యను పరిష్కరించడానికి హిసార్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేపట్టారు. ముర్రా జాతికి చెందిన 100 గేదెలను ఎంపిక చేసి, వాటికి రెగ్యులర్ గా సమతుల్య ఆహారం అందించారు. సమయానికి అన్ని టీకాలు అందిస్తూ.. ఎండాకాలం, చలికాలం, వర్షంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ పరిశోధనల్లో మతం 100 గేదెలు కూడా 3 సంవత్సరల 3 నెలల్లోనే దూడలకు జన్మనిచ్చాయి.
ముఖ్యంగా గేదెలకు సరైన పోషకాహారాలు అందకపోవడం వలనే వాటిలో మొదటి గర్భం ఆలస్యం అవుతుంది అని డాక్టర్ టీకే దత్తా అన్నారు. కాబట్టి వాటికి మంచి ఆహారాన్ని పెడితే సమస్య తీరుతుంది. గేదెలకు ప్రతిరోజు 15 కిలోల ఆహరం ఇవ్వాలి. వీటి ఆహార మిశ్రమంలో పచ్చి మేత 7 కిలోలు, ఎండు మేత 5-6 కిలోలు, పొట్టు 30 శాతం, ధాన్యం 40 శాతం, ఊక, శెనగ పొడి 25 శాతం, 1-2 శాతం ఉప్పు మరియు 1 శాతం ఖనిజ మిశ్రమం ఉండాలి.
ఇది కూడా చదవండి..
Share your comments