సముద్రతీర ప్రాంతాలలో మత్స్యకారులు రోజు సముద్రంలో వేటకు వెళుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తుంటారు ఈ క్రమంలోనే కొన్నిసార్లు వారికి సముద్రంలో భారీ చేపలు పడుతూ ఉంటాయి అదేవిధంగా ఇంటికి వెళ్లిన మత్స్యకారులకు కొన్ని సార్లు నిరాశ కూడా ఎదురవుతుంది.ఇలా అరుదైన జాతికి చెందిన భారీ చేపలు వలలో పడితే ఆ మత్స్యకారులు పంట పండింది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అలాంటి చేపలను మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతూ లక్షల్లో ఆదాయం పొందుతారు.
తాజాగా విశాఖ జిల్లా మత్స్యకారులకు ఈ విధమైనటువంటి సంఘటన ఎదురైంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వలలో రెండు టన్నుల భారీ సొరచేప పడటంతో వారు ఎంతో సంతోషించారు. దీంతో వారి దశ మారి పోయిందని సంబరపడ్డారు. ఈ పులి బుగ్గల సొరచేపలు దాదాపు 150 మంది మత్స్యకారులు సుమారు మూడు గంటల పాటు శ్రమించి విశాఖ షిప్పింగ్ హార్బర్ కి తరలించారు.
ఈ విధంగా అతి భారీ సొర చేప వలలో పడిందన్న సంతోషం జాలర్లకు కొంతసేపు కూడా నిలవలేదు. టీ జాలర్లు సొరచేప షిప్పింగ్ హార్బర్ కు తీసుకు వచ్చేలోపు అది మృతి చెంది ఉండడంతో ఆ సొరచేప మనం కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే మత్స్యకారులు చేసేదేమీ లేక ఆ సొరచేపను తిరిగి సముద్రంలో వదిలి వేశారు. ఈ సొరచేపను ఫిషింగ్ హార్బర్ కి తీసుకురావడానికి 150 మంది జాలర్లు ఇష్టపడటమే కాకుండా ఏకంగా ఐదు వందల లీటర్ల డీజిల్ ఖర్చు అయిందని మత్స్యకారులు తెలియజేశారు. ఇంత పెద్ద భారీ చేప దొరికినా అది చనిపోవడంతో వారికి చివరికి నిరాశ మిగిలింది.
Share your comments