ఆకుల సాగు ఏంటని చూస్తున్నారా? ఈ పంట పండిస్తే మార్కెట్ లో అమ్ముడుపోయేది ఆకులే మరి.ఈమధ్య కాలం లో బాగా డిమాండ్ ఉంటున్న అలంటి మూడు ప్రముఖ పంటల ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అన్ని రకాల వ్యవసాయం చేస్తారు. వరి, గోధుమలే కాకుండా కొంత మంది కూరగాయలు, మరికొందరు పండ్లను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. మరోవైపు, కొంతమంది రైతులు పండ్ల/పూల తోటల పెంపకం ద్వారా కూడా బంపర్ ఆదాయాలు సంపాదిస్తున్నారు . ఆలా హార్టికల్చర్ పంటల్లోకి వచ్చే , మూడు ఆకుల గురించి ఈ పోస్ట్ లో తెలుసుకోండి , ఇవి రైతుల అదృష్టాన్ని మార్చగలదు. ప్రతి సంవత్సరం లేదా నెల వారిగా భారీ లాభాలు సంపాదించవచ్చు.
తమలపాకు వ్యాపారం
తమలపాకుల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజులు, చక్రవర్తుల కాలం నుండి పాన్ చాలా ప్రజాదరణ పొందింది. భారతదేశంలో ప్రతి రెండవ లేదా మూడవ వ్యక్తి పాన్ తినడం జరుగుతుంది.అలాగే ఇవి పూజకు కూడా పెద్ద మొత్తం లో ఉపయోగించబడుతాయి . దుకాణదారులు విక్రయించే పాన్ అయినా, గుళ్ళలో వాడే ఆకుల రూపాన అయినా మన దేశంలో ప్రతిరోజూ టన్నుల కొద్దీ తమలపాకులు వినియోగిస్తున్నారు. తమలపాకుల్లో చాలా రకాలు ఉన్నాయి. తమలపాకుల్లో ఔషధ గుణాలు కూడా ఉడడం వీటి డిమాండ్ కు ఇంకో కారణం. కాబట్టి రైతులు తమలపాకుల సాగు ద్వారా మంచి ఆదాయాలు సంపాదించవచ్చు.
ఇది కూడా చదవండి
అధిక లాభాలు ఇచ్చే తమలపాకు సాగు; మార్కెట్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉండే పంట
విస్తరాకు వ్యాపారం :
నేటి యువతకు విస్తారాకుల గురించి తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు ప్రతి పెళ్లి లేదా ఈవెంట్‌లో ఆహారం అందించడానికి ప్లేట్‌లకు బదులుగా విస్తరాకులనే ఉపయోగించేవారు . కానీ ఆ ట్రెండ్ మల్లి తిరిగి వొచింది. పర్యావరణ రక్షణ కొరకు బయోడిగ్రేడబుల్ విస్తరాకుల వైపు మక్కువ చూపుతున్నారు ప్రజలు. కాబట్టి గత కొద్ది రోజులుగా మార్కెట్‌లో ఈ ఆకులకు మళ్లీ డిమాండ్ పెరిగింది. పైగా చాలా ఖరీదైనవి గా ఉన్నాయి. ఒక రైతు విస్తరాకుల చెట్టును నాటితే, రెండు విధాలుగా ఆదాయం పొందొచ్చు. ఒకటి, ఆకులను అమ్మడం ద్వారా , మరోవైపు, మద్ది కలపను విక్రయించడం ద్వారా కూడా విపరీతంగా సంపాదించవచ్చు. దీని కలపకు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా డిమాండ్ ఉంది.
అరటి ఆకు వ్యాపారం
నేటికీ దక్షిణ భారతదేశంలో, వివిధ కార్యక్రమాలలో అరటి ఆకులపై ఆహారాన్ని అందించే ఆచారం ఉండనే ఉంది. అలాగే , దేశంలోని మిగిలిన ప్రాంతాలలో కూడా దాని ప్రజాదరణ క్రమంగా పెరుగుతోంది. అరటి ఆకులను పూజలో కూడా ఉపయోగిస్తారు. సిటీ లలో కూడా అరటి ఆకులపై ఆహారాన్ని అందిస్తున్న రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి . కాబట్టి ఆ డిమాండ్ కు అనుగుణంగా అరటి ఆకుల సాగు కూడా రైతులకు లాభదాయకంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి
Share your comments