Kheti Badi

ఉసిరి వల్ల కలిగే ఉపయోగాలు.. సాగు చేయు విధానం!

KJ Staff
KJ Staff
Amla Cultivation
Amla Cultivation

సాధారణంగా ఆమ్ల, గుస్బెర్రీ, శాస్త్రీయంగా ఫిలాంథస్ ఎంబ్లికా అని పిలువబడే ఉసిరి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరిలో ఉండే అనేక రకాల విటమిన్లు, ఇతర పోషకాలు, గాలిక్ ఆమ్లం, టానిక్ ఆమ్లం, ఫిల్లెంబ్లిన్, టానిన్లు, ఫాస్ఫరస్, కాల్షియం వంటివి అధికంగా ఉంటాయి. దీనిని వివిధ రకాల వంటలు చేసుకోవడంతో పాటు ఆయుర్వేద మందుల తయారీలోనూ అధికంగా ఉపయోగిస్తారు. ఉసిరిలో పుష్కలంగా ఉంటే సీ విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మెదడు పనితీరును మెరుగు పర్చడంతో పాటు వివిధ రకాల చర్మ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. దీనిని వివిధ రకాల పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఉసిరిని సాగు చేయడం పెద్ద కష్టంతో కూడుకున్న పనేమి కాదనీ అంటున్నారు వ్యవసాయ  రంగ నిపుణులు.

ఉసిరి సాగు:

ఉసిరిని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేయవచ్చు. ఈ మొక్కలు దాదాపు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. అయితే, అంటుకట్టడం, కొత్తగా అభివృద్ధి చేసిన రకాలతో తక్కువ ఎత్తు పెరిగి.. అధిక దిగుబడిని ఇచ్చే ఉసిరి మొక్కలు రకాలు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.  ఉసిరిని సాగు చేయడానికి ఎర్ర నేలలు, లోమ్ నెలలు, దుబ్బ నెలలు, ఇసుక నేలలు సైతం అనుకూలంగా ఉంటాయి. భూమిలో పీహెచ్ విలువ 7 నుంచి 9.5 శాతం వరకు ఉండే అన్ని నేలలలో  ఉసిరిని సాగు చేయవచ్చు.

ఉసిరిని సాగుకోసం నేలలో 60*60*60 సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలు (గొయ్యి) తీసుకోవాలి. ఇందులో 200 గ్రాముల నత్రజని ఎరువులు కలిపి గుంతల్లో వేసుకోవాలి.

ఆ తర్వాత అందుబాటులో ఉన్న నర్సరీలను నుంచి అధిగ దిగుబడిని ఇచ్చే ఉసిరి మొక్కలను తీసుకుని నాటుకోవాలి. అనంతరం మొక్కలకు నీరు పెట్టాలి. ఒక ఎకరం పొలంలో 160కి పైగా మొక్కలునాటుకోవచ్చు. జూన్ జులై కాలంలో నాటుకుంటే మొక్కల పెరుగుదల, నాటుకోవడం మంచిగా ఉంటుంది. మొక్కల పెరుగుదలకు అనుగుణంగా సేంద్రీయ ఎరువులతోపాటు కృత్రిమ ఎరువులను అందించాలి.  మొక్కలు నాటిన మూడు సంవత్సరాలకు కాపును అందిస్తాయి. ప్రవర్థనం చేసిన కొన్ని రకాలు అంతకంటే ముందుగానే కాపును అందిస్తాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఉసిరికాయలు కొతకు వస్తాయి.  ఈ సమయంలో కాయలకు తెగులు సోకకుండా మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine