రైతులు అధిక దిగుబడి, లాభాల కోసమో వేసిన పంటనే మళ్లీ వేస్తూ ఉంటారు. కొంతమంది రైతులు పక్కవారు అదే పంట వేస్తున్నారని వేసిన పంటే మళ్లీ మళ్లీ వేస్తూ ఉంటారు. ఇక ఒకే పంటకు ఎక్కువ రేటు ఉందని అదే పంట ప్రతి ఏడాది వేస్తూ ఉంటారు. కానీ దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పంట ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని, దీనిపై రైతుల్లో అవగాహన కల్పించాల్స ఉందంటున్నారు.
కొంతమంది రైతులకు అవగాహన లేక వేసిన పంటనే మళ్లీ మళ్లీ వేస్తూ ఉంటారని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పంట మార్పిడి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
మరి పంట మార్పిడి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
పంట మార్పిడి వల్ల ఉపయోగాలు
-చీడపీడలు దూరం అవుతాయి.
-మందుల ఖర్చు తగ్గుతుంది
-పంటలో నాణ్యత పెరిగి దిగుబడి పెరుగుతుంది
-భూమిలో నీరు నిల్వ పెరిగి భూసారం వృద్ధి -చెందుతుంది
-కీటకాల గడ్లు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు
పంట మార్పిడిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
-జొన్న పంట సాగుచేసిన పొలంలో మిరప వేయకూడదు.
-వేరుశనగ తర్వాత ఆముదంలో పంట మార్పిడి చేసుకుంటే మంచిది
-వేరుశనగ సాగుచేసిన తరువాత మళ్లీ అదే పంట వేసుకూడదు
-వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలు పండిస్తే మంచిది
-వరి పప్పుధాన్యాల పైర్లను నూనెగింజల పైర్లను పంచిండచుకోవాలి
Share your comments