రైతులు సంప్రదాయ పంటలను పండిస్తున్నపుడు అధిక దిగుబడులను పొందడానికి కొత్త పద్ధతులను పాటిస్తూ ఉండాలి. ఉద్యాన పంటలు, కూరగాయల సాగులో అనేక సమస్యలు వస్తున్నాయి. వీటిని అధికమించడానికి రైతులు కొత్త సాంకేతికతను అవలంబిస్తున్నారు. ఈ కొత్త పద్ధతుల్లో ఒకటి మల్చింగ్. పంటను సాగు చేస్తున్నపుడు ఈ మల్చింగ్ పద్ధతిని ఉపయోగించడం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి.
సాధారణంగా మెరక భూముల్లో సాగుచేస్తే కలుపు సమస్య అధికంగా ఉంటుంది. పంటలకు నీరు పెట్టిన ప్రతి సారి కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి. పంట పొలాల్లో కలుపు తీయడం కష్టతరంగా మారుతుంది. రైతులకు ఈ కలుపు మొక్కలు కారణంగా వారిపై అధిక భారం పడుతుంది. ఈ కలుపును నివారించడానికి ఈ మల్చింగ్ పధ్ధతి బాగా పనికివస్తుంది. రైతుకు ఆర్థికభారం తగ్గడంతోపాటు పంట దిగుబడి కూడా పెరుగుతుంది.
మల్చింగ్ ఆంటే ఏమిటి ?
మల్చింగ్ అంటే మొక్కల వేర్ల చుట్టూ ఉన్న మట్టిని ఏదైనా పదార్థంతో కప్పి పెట్టాడాన్ని మల్చింగ్ అంటారు. ఆ పదార్ధాలు అనేవి ఎండు గడ్డి, ఎండిన ఆకులు, ఊక, వరి పొట్టు వంటివి. వీటిని ఉపయోగించినట్లయితే సహజసిద్ధంగా మల్చింగ్ చేయవచ్చు. లేదా ప్లాస్టిక్ షీట్‌తోనూ మల్చింగ్ చేయొచ్చు.
ఇది కూడా చదవండి..
పెరుగుతున్న పత్తి ధరలు.. రైతులకు ఊరట
ఈ ప్లాస్టిక్ షీట్ ని కృత్రిమంగా తయారు చేస్తారు. ఈ పద్ధతులతో భూమిలోని తేమను సంరక్షించడంతోపాటు కలుపు నివారణ, నేల కోతకు గురికాకుండా కాపాడుకోవచ్చు. మల్చింగ్ విధానంలో రసాయన ఎరువులు, సస్యరక్షణకు అయ్యే ఖర్చును 25 శాతానికి పైగా ఆదా చేసుకోవచ్చు.
పంటపొలాల్లో విత్తనాలను విధ్డానికి ముందే మల్చింగ్ షీట్ ని వేయాలి అనుకుంటే మొక్కల మధ్య దూరాన్ని బట్టి ముందుగానే రంధ్రాలు చేసుకోవాలి. మొక్కలకు రెండు వైపులా 5-10 సెంటీమీటర్ల లోతుగా నాగలిసాలు వేయాలి. తరువాత కావాల్సిన సైజులో షీట్ ని కత్తిరించుకుని, నాగలి సాలులోకి పోయేలా ఏర్పాటుచేసుకొని మట్టితో అంచులను కప్పి వేయాలి. ఈ మల్చింగ్ షహీట్ ను కేవలం ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే వేయాలి.
ఇది కూడా చదవండి..
Share your comments