సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి?
క్రిమిసంహారక రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే ఆర్గానిక్ పదార్ధాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత రసాయన, క్రిమిసంహారక మందులు ఉపయోగించి వ్యవసాయం చేసే పద్దతి వచ్చింది. సేంద్రియ వ్యవసాయం అనేది సాంప్రదాయ వ్యవసాయం. స్వచ్చమైన వ్యవసాయం అని చెప్పవచ్చు.
సేంద్రియ వ్యవసాయం వల్ల లాభాలేంటి?
నేల శక్తి మరింత వృద్ధి చెందుతుంది.
పెట్టుబడి ఆదా అవుతుంది
నేలలో ‘‘హ్యూమస్’’ నిల్వలు పెరిగి పోషకాలను పంటకు అందిస్తుంది.
నీటిని, పోషకాలను నిలువరించే గుణం పెరుగుతుంది.
నీటి నిల్వ సామర్ద్యం, మురుగు నీరు పోవు సౌకర్యం కలుగుతుంది.
నేల కాలుష్యం తగ్గి నాణ్యతతో కూడిన ఉత్పాదకత జరుగుతుంది.
భూగర్బజలాల కాలుష్య నివారణకు దోహదపడుతుంది.
పర్యావరణ సమతుల్యత దోహదపడుతుంది.
నాణ్యమైన సురక్షిత ఆహారం లభిస్తుంది
నాణ్యత, నిల్వ ఉండే గుణం పెరుగుతుంది
సుస్థిర సేద్యానికి, రైతు మనో వికాసానికి, దేశ ప్రగతికి మాయమవుతుంది.
సాగు పద్దతి
అవసరం మేరకు, అతి తక్కువగా దుక్కి దున్నాలి. ఎక్కువగా దుక్కి దున్నితే నేల కోతకు గురి కావడమే కాక నెలలోని సూక్ష్మజీవులు , ప్లనకాల (ఫ్లోరా, ఫానా ) సంఖ్యా బాగా తగ్గిపోతుంది. అందుకే తక్కువగా దుక్కి దున్నాలి.
సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంటలను సాగు చేయాలి. మిశ్రమ పంటలను సాగు చేయడం వల్లన పురుగుల తాకిడి తగ్గించవచ్చు.
ఇక పంట మార్పిడి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నేల సారం పెరుగుతుంది. కీటకాలు, పురుగుల నుంచి రక్షణ ఉంటుంది.
వృక్ష, జంతు సంబంధ వ్యర్ధాలను అన్నిటినీ సేంద్రియ ఎరువుగా మార్చి వినియోగించాలి.
-అంతర కృషి చేస్తూ కలుపు సకాలంలో తీసి పంటకు తగినంత పోషకాలు అందేటట్లు చూడాలి.
- జీవన ఎరువు ప్రాధాన్యత రైతుకు తెలిపి విరివిగా వాడేటట్లు చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా జీవన ఎరువు ఉత్పత్తి ఎక్కువ చేసి రైతుకు అందజేయాలి.
- నీటి వనరును సద్వినియోగం చేస్తూ, నేలలోని తేమను పరిరక్షించుటకు తగు సేద్య విధానాలను అవలంభించాలి.
- సస్య రక్షణకు వృక్ష, జంతు సంబంధ మందును వాడాలి.జీవ నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యత ఇచ్చి సస్యరక్షణ చేయాలి.
- పంట దిగుబడులు తగ్గకుండా, నాణ్యత చెందకుండా, ప్రకృతి ప్రసాదిత వనరును ఉపయోగించుకోవాలి.
Share your comments