తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత ఎక్కువగా పండించే పంటల్లో మినుము ముందు వరుసలో ఉంటుంది. వరి పంట పూర్తైన తర్వాత అదే పోలంలో మినుము, పెసర లాంటి చిరుధాన్యాల పంటలు వేస్తారు. వరి పంట వల్ల నేలలో పొడిశాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మినుము పంటకు ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు. వర్షపు నీటితోనే ఈ పంట పడుతుంది. ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం ఉండదు. ఎక్కువ శ్రమ కూడా ఉండదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పంట మినుము. అందుకే ఈ పంటను సాగు చేసేందుకు చాలామంది రైతులు ఆసక్తి చూపుతూ ఉంటారు.
మినుము పంటలో కలుపు నివారణ ఎలా?
మినము పంటలో కలుపు మొక్కల సమస్య ఎక్కువగా ఉంటాయి. మినుము మొక్కల చుట్టూ కలుపు మొక్కలు చేరి పంట ఎదగుదలను నాశనం చేస్తాయి. దీని వల్ల అధిక దిగుబడి రాదు. అందుకే కలుపు నివారణ మినుము పంటలో ప్రధానమైనది. కలుపును నివారించడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
మెట్ట పంటలో మినుము విత్తుటకు ముందు ప్లూక్టోరాలిస్ 45% ద్రావకం ఎకరాకు 1 లీటరు చొప్పున భూమిపై పిచికారి చేసి గుంటకతో పై పైన కలియదున్నాలి. దీని వల్ల కలుపు మొక్కలు రాకుండా ఉంటాయి.
లేదా పె౦డిమిథాలిస్ 30% ద్రావకం ఎకరాకు 1.3 ను౦డి 1.6 లీటరు చొప్పున విత్తిన వెంటనే లేదా మరుసటి రోజున పిచికారి చేయాలి.
ఇక మాగాణి పంట విషయానికొస్తే.. ఫెనాక్సోపాప్ ఇథైల్ 9% ద్రావకం ఎకరాకు 250 మి-లి- లేదా క్యేజలాసాప్ ఇథైల్ 5 శాత౦ ద్రావకం ఎకరాకు 400 మి.లి చొప్పున ఏదొ ఒక దానిని 200 లిటర్ల నీటిలో కలిపి విత్తిన 20-25 రోజులప్పుడు పిచికారి చేయాలి.
మినుము పంటకు ఏ నేలలు అనుకూలం
మినుము పంటకు చౌడుభూములు పనికిరావు. తేమను నిలుపుకోగల భూములు, మురుగు నీరుపోయే వసతి గల భూములు మినుము పంటకు అనుకూలం. మినుము పంటకు వేసవి దుక్కి చేసి తొలకరి వర్షాలు పడగానే గొర్రు తోలి భుమిని మెత్తగా తయారు చేయాలి.
విత్తే సమయం, విత్తన శుద్ధి ఎలా?
జూన్, జులైలో అనుకూలం. రబీ మెట్టిలో ఆక్టోబర్ మాసంలో,రబీ మాగాణిలో నవంబర్ మాసంలో ,వేసవి ఆరుతడిలో ఫిబ్రవరి మాసంలో,వేసవి మాగాణల్లో మార్చి మాసంలో విత్తుకోవచ్చు.
తొలకరిలో ఎకరానికి 6, 5.8 కిలోలు, రబీ మెట్టలో ఎకరానికి 6,5.8 కిలోలు , రబీ మాగాణిలో ఎకరానికి 16 కిలోలు, వేసవి ఆరుతడిలో ఎకరానికి 10-12 కిలోలు ,వేసవి మాగాణిలో ఎకరానికి 16-18 కిలోలు విత్తనాలను విత్తుకోవాలి.
విత్తన శుద్ది ఎలా?
కిలో విత్తనానికి ౩౦ గ్రాముల కార్బోసల్ఫాన్, 2.5 గ్రా థైరమ్ లేదా కాకాప్తాన్స్ మ౦దును వాడాలి. తొలకరిలో 30X10 సెం.మీ.,రబీమెట్టలో 30X 10సెం.మి., వేసవి ఆరుతడిలో 22.5X10సెం.మీ .దూరంలో విత్తుకోవాలి.
Share your comments